మహిళలకు ఉచిత బస్సు ఆ సర్వీసుల్లోనే- అమలు అప్పుడే..!!

ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభం అయ్యేది ఎప్పుడు. ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు సంక్రాంతికి ప్రారంభిస్తారని చెప్పినా.. అది సాధ్యపడే అవకాశం లేదు. తాజాగా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి కీలక నివేదిక ఇచ్చారు. దీంతో, ఈ పథకం అమలు ఎప్పుడు అనేది ఒక అంచనా కనిపిస్తోంది. అయితే, ఆర్దిక భారం మాత్రం ప్రభుత్వానికి సమస్యగా మారుతోంది.

ప్రభుత్వ కసరత్తు
ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పన పైన ప్రభుత్వం తాజాగా ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ పథకం అమలవుతున్న అయిదు రాష్ట్రాల్లో పరిశీలించి, ఏపీలో అమలు దిశా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీ తాజాగా ప్రభుత్వానికి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పథకం అమలుకు ముందే కొత్త బస్సులు.. ఆర్టీసీలో కొత్త నియామకాలు...ఆర్దిక భారం పైన అందులో వివరించింది. ఈ పథకం అమలు చేయాలంటే ముందుగా రెండు వేల అదనపు బస్సులతో పాటుగా 11,500 మంది సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

RTC officials submits key report over implementation of free bus for women in the state

ఆర్దిక భారం
అదే సమయంలో ఆర్దికంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ మేర భారం కానుందీ నివేదికలో వివరించారు. కొత్తగా తీసుకునే సిబ్బంది వేతనాల కోసం రూ 300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని, అదే విధంగా ప్రస్తుతం మహిళా ప్రయాణీకుల ద్వారా రోజు వస్తున్న రూ 6 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని గణాంకాలతో పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వం పై ఏడాదికి ఈ పథకం అమలు చేస్తే రూ 2,150 కోట్ల వరకు భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ మేర ప్రభుత్వం నుంచి రీయంబర్స్ మెంట్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆర్టీసీకి కొత్తగా ఆదాయం పెంచుకునే మార్గాలు లేవని స్పష్టం చేసింది.

ఉగాది కే అమలు
ఈ పథకం అమలు చేయాల్సిన సర్వీసుల గురించి కొన్ని కీలక సూచనలు చేసింది. పల్లె వెలుగు, మెట్రో సర్వీస్, విజయవాడ - విశాఖ సిటీ బస్సుల్లో ఈ ఉచిత బస్సు అమలు పరిమితం చేసినా ఈ భారం తప్పదని అధికారులు విశ్లేషించారు. ఇటు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. ఫలితంగా ఈ పథకం ముందుగా అంచనా వేసిన విధంగా ఇప్పటికిప్పుడు అమలు చేసే అవకాశం కనిపించటం లేదు. అన్నీ అనుకూలిస్తే ఉగాది రోజున ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవా లని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+