వైసీపీలోకి మాజీ ఐఏఎస్ - నియోజకవర్గం ఖరారు..!!
ఏపీలో ఎన్నికల వేళ పార్టీల్లొ చేరికలు పెరిగాయి. వైసీపీ నుంచి పలువురు ఈ మధ్య కాలంలో టీడీపీ, జనసేనలో చేరారు. టీడీపీలో సీట్లు దక్కని వారు వైసీపీలో చేరుతున్నారు. ఈ సమయంలోనే ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ తాజాగా స్వచ్చంద పదవీ విరమణ చేసారు. ఆయన వీఆర్ఎస్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో , తాజాగా సీఎం జగన్ సమక్షంలో ఇంతియాజ్ వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ సీఎం జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్, సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ స్థానంలో ఇంతియాజ్ ను కర్నూలు సిటీ ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇంతియాజ్ ఆసక్తి చూపటం తో జిల్లా నేతలతో చర్చించిన తరువాత సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్దపడిన ఇంతియాజ్ తన పదవికి రాజీనామా చేసారు. స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసారు. వెంటనే ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

ఈ రోజు అధికారికంగా వైసీపీలో చేరిన ఇంతియాజ్ ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దిగా కర్నూలులో ప్రచారం ప్రారంభించనున్నరాు. వైసీపీ ఆవిర్భావం తరువాత కర్నూలులో వరుసగా గెలుస్తూ వస్తోంది. 2019 లో కర్నూలు జిల్లాలో వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. 14 అసెంబ్లీ స్థానాలతో పాటుగా రెండు ఎంపీలను గెలుపొందింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇంతియాజ్ ను ఖరారు చేసిన జగన్..ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను కర్నూలు మేయర్ గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మేయర్ బీవై రామయ్యను వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా బరిలోకి దింపటం దాదాపు ఖాయమైంది. ఈ మార్పులు, అభ్యర్దుల పైన ఈ సాయంత్రం వైసీపీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications