వైసీపీని దారుణంగా మోసం చేసింది వారే?
ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. పార్టీల భవిష్యత్తు ఈవీఎంల్లో నిక్షిప్తమైవుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటించేవరకు ప్రధాన పార్టీల తరఫున పోటీచేసిన అభ్యర్థులంతా మునివేళ్లమీదే కూర్చొనివుంటారు. గత ఎన్నికల్లో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 151 సీట్లు, 22 లోక్ సభ నియోజకవర్గాలను దక్కించుకున్న వైసీపీలో ఈసారి ఆ స్థాయి ఆత్మవిశ్వాసం కనిపించలేదు. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యమే కనపడుతోంది. పోలింగ్ సరళి ఏం చెబుతోంది? అనే విషయంపై వైసీపీ అభ్యర్థులంతా చర్చించుకుంటున్నారు.
ముందే చేతులెత్తేశారు
నగరి నుంచి పోటీచేసిన రోజా ముందే చేతులెత్తేసినట్లుగా భావించాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సొంతవారే తనను ఓడించేందుకు సిద్ధమయ్యారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ముందుగానే రోజా తన ఓటమిని బయటపెట్టారంటున్నారు. సత్తెనపల్లి నుంచి పోటీచేసిన మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీగా పోటీచేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాంటివారంతా ఎన్నికల కమిషన్ కూటమికి సహకరించిందని, తమ ఫిర్యాదులను పట్టించుకోలేదంటూ ఓటమి భయాన్ని ముందే బయటపెట్టారంటున్నారు. వీరు అలా మాట్లాడకుండా ఉండివుంటే కాస్తో కూస్తో వైసీపీకి పాజిటివ్ ఉందని అనుకునేవారని, చివరకు ఆ భావన కూడా చేశారంటున్నారు.

మౌనంగా గ్రామీణ ఓటరు
పట్ణణ ఓటర్లు కూటమివైపు మొగ్గినా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు మాత్రం తమవైపే ఉంటారనే భావనతో వైసీపీ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అయితే పోలింగ్ సరళి తర్వాత ఆ విశ్వాసం కనిపించలేదు. బటన్ నొక్కడం ద్వారా తాము బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులు, సంక్షేమ పథకాలు ఓట్లు మారతాయని, వెల్లువెత్తుతాయని వైసీపీ నేతలు భావించారు. పథకాలద్వారా లబ్ది పొందినవారు పోలింగ్ ముందువరకు మౌనంగానే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో వారంతా తమవారేనని వైసీపీ భావించింది. అయితే పోలింగ్ రోజు ఆ నమ్మకం సడలింది. ప్రజల్లో కనిపించిన మార్పువల్ల కూటమి లాభపడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ గ్రామీణ ఓటరు తీర్పు ఏమిటనేది తెలుసుకోవడానికి జూన్ నాలుగోతేదీ వరకు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications