గ్రాఫిక్స్‌కు అలవాటు పడిన ప్రాణాలు వారివి
Rushikonda Buildings: విశాఖపట్నం రుషికొండ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి చెందినవేనని వైఎస్ఆర్ కాంగ్రెెస్ పార్టీ సీనియర్ నాయకుడు మజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ముంద ఆలోచన చేయాలని సూచించారు.
రుషికొండ వద్ద నిర్మించిన భవనాలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత ప్యాలెస్ అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. అధికారంలో ఎవరు ఉన్నా వారికి ఆ భవనాలు చెందుతాయని చెప్పారు. మున్ముందు ఆ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని మానేసి జగన్ ఇంటిగా చూడటం సరికాదని చెప్పారు.

విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా మార్చాలనే కాన్సెప్ట్ ఉండటం వల్ల అక్కడికి వచ్చే వారి కోసం రుషికొండలో ఈ భవనాల అవసరం అవుతుందని జగన్ భావించారని, అందుకే వాటిని నిర్మించారని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచే పరిపాలన సాగించేలా తమ ప్రభుత్వం చర్యలు సైతం తీసుకుందని గుర్తు చేశారు.
2014 నుంచి 2019 వరకు అధికారంలో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలను ధారబోసి అన్నీ తాత్కాలిక భవనాలను నిర్మించారని అమర్‌నాథ్ గుర్తు చేశారు. 600 కోట్ల రూపాయలతో తాత్కాలిక సచివాలయం కట్టాడని చెప్పారు. ఇది తాత్కాలిక సచివాలయం అని చంద్రబాబే స్వయంగా ఒప్పుకొన్నాడని చెప్పారు.

కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన హైకోర్టు భవనం కూడా తాత్కాలికమేనని అమర్‌నాథ్ అన్నారు. తమ ప్రభుత్వం అలా కాదని, విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, అధికార నివాసాలను రుషికొండ వద్ద శాశ్వత భవనాలుగా నిర్మించామని చెప్పారు.
తన అయిదు సంవత్సరాల హయాంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌తో మాయాజాలం సృష్టించాడంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేస్తోన్నారు. జగన్ తన ప్రభుత్వ హయాంలో కళ్లు చెదిరేలా శాశ్వత కట్టడాలను కట్టడంతో గ్రాఫిక్స్‌కు అలవాటు పడిన వారి ప్రాణాలు తట్టుకోలేకపోతున్నాయంటూ చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications