వైసీపీకి ఫ్రీ పబ్లిసిటీ.. రుషికొండ మైలేజ్ జగన్ ఖాతాలోకే
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ చూట్టునే తిరుగుతున్నాయి.విశాఖ రాజధానిగా అప్పటి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అక్కడ కట్టడాలు నిర్మించారు. సీఎం క్యాంపు కార్యలయం కోసమని రూ.500 కోట్లతో భారీ భవనాలు నిర్మించారు. అయితే గత ప్రభుత్వంలో అక్కడ ఏం జరుగుతుందో బయటకు రాలేదు.ఇప్పుడు ప్రభుత్వం మారడంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హడావిడి చేస్తూ రుషికొండను సందర్శించారు. ఇన్నాళ్లు రుషికొండలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం చేసిన టీడీపీ నేతలకు అక్కడ ప్రభుత్వ కట్టడాలు మాత్రమే కట్టారని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.
రుషికొండలో కట్టింది ప్రభుత్వ కట్టడాలే అని, సీఎం క్యాంపు కార్యాలయం కోసమని ఆ భవనాలు నిర్మించామని వైసీపీ నేతలు తెలిపారు. అంతేకాని జగన్ ఉండటానికి నిర్మించిన ఇల్లు కాదని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. రుషికొండలో అక్రమ కట్టడాలు చూపించి క్రెడిట్ కొట్టేయాలని చూసిన టీడీపీ నేతలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండలో ఉన్నది ప్రభుత్వ కట్టడాలే అని తేలడంతో టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ప్రజాధనంతో జగన్ జాల్సాలు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు.

అయితే దీనిపై వైసీపీ నేతలు గట్టిగానే టీడీపీకి కౌంటరిస్తున్నారు. జగన్ రూ. 500 కోట్లతో ఎంతో అపురూపమైన కట్టడాలు..అది కూడా శాశ్వత భవనాలను రుషికొండలో నిర్మించారని.. చంద్రబాబు మాదిరిగా రూ. 700 కోట్లతో తాత్కలిక భవనాలను నిర్మించి ప్రజాధనానికి నష్టం చేకూర్చలేదని వైసీపీ నేతలు టీడీపీ నాయకులకు కౌంటరిస్తున్నారు. రూ. 700 కోట్లతో తాత్కలిక భవనాల్లో వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూశారని టీడీపీ నాయకులను వైసీపీ నేతలు ఎద్దెవా చేస్తున్నారు. మరోవైపు రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి రూ.450 కోట్లు ఖర్చు కాగా.. అందులోని ఇంటీరియర్ కోసమే రూ.120 కోట్లు ఖర్చు అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి రుషికొండలో భవన నిర్మాణల విషయంలో వైసీపీకి ఫ్రీ మైలేజ్ దొరికినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications