ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమం.. సహాయం కోసం ఇద్దరు అధికారుల నిమామకం : మంత్రి ఆదిమూలపు
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం తలెత్తడంతో ఇండియా అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థుల కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తమ వెంట పాస్ పోర్టులు, అవరసమైన ఇతర పత్రాలు తమ వెంట ఉంచుకోవాలని సూచించింది.

ఉక్రెయిన్‌లో విద్యార్థులు క్షేమం
ఉక్రెయిన్‌లో సుమారు 500 మందికిపైగా తెలుగు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అక్కడి పరిస్థితులను ఎప్పుటికప్పుడు తెలుసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపి మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

విదేశాంగ శాఖకు సీఎం జగన్ లేఖ
ఇప్పటికే సీఎం జగన్ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాసినట్లు మంత్రి అదిమూలపు సురేష్ వెల్లడించారు. రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతీయులను తరలింపునకు కేంద్రం తీసుకున్న చర్యలను సీఎం ప్రశంసించారు. ఏపీ విద్యార్థులను కూడా ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. తెలుగు విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు..
Recommended Video

విద్యార్థుల కోసం ఇద్దరు అధికారుల నియామకం
అయితే ప్రస్తుతం యుద్ధవాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో విమాన సర్వీసులు రద్దయ్యాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సహాయం అందించేందుకు నోడల్ అధాకారి , స్పెషల్ ఆఫీసర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు వెల్లడించారు. నోడల్ అధికారి రవిశంకర్ 9871999055, అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ గీతేష్ శర్మ 7531904820 లను సంప్రదించాలని కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి ఆదిమూలపు తెలిపారు.












Click it and Unblock the Notifications