టి కోసం ఏమైనా, అంతా సోనియానే: సబ్బం నిప్పులు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం కాంగ్రెసు పార్టీ ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉందని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి ఆదివారం విశాఖలో ధ్వజమెత్తారు. ఎపి మీద కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. సీట్లు కోసం తెలుగువారిని ఎందుకింత భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారని, ఓట్ల కోసమే తెలుగువారిని విభజిస్తున్నారని, విభజన కోసం కాంగ్రెస్ ఏదైనా చేసేందుకు సిద్ధమవుతోందని, అప్రజాస్వామికంగా ముందుకెళ్తోందని అన్నారు.

గతంలో కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అండగా నిలిచిందని, మరి ఎందుకింత పగబట్టి విభజన చేస్తున్నారన్నారు. కేంద్రాన్ని అడిగితే హైకమాండ్ నిర్ణయం అంటున్నారు. హైకమాండ్ అంటే ఎవరో తెలియడంలేదని, పేరుకే హైకమాండ్ నిర్ణయాలన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీవే అన్నారు. బిల్లును ఆపడానికి ఏమైనా చేయాలంటే వచ్చే రెండు వారాల్లో చేయాలన్నారు.

sabbam hari

అందుకే ఉద్యమాన్ని తీవ్రం చేసి, మాతో కలిసి వచ్చే పార్టీలతో పార్లమెంటులో ఉద్యమం ఉధృతం చేస్తామని, మా చర్యలు, భాషా కూడా తీవ్రం చేస్తామన్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో పార్లమెంటులో మా నిరసన కొనసాగిస్తాం, 70 మంది ఎంపీల సంతకాలతో యూపిఏ పై అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన తెలిపారు. గుజరాత్, తమిళనాడులో కాంగ్రెస్ గల్లంతయిందని, బిజెపితో కలిసి రాష్ట్రాన్ని విభజించడానికి చర్చిస్తుంది.

కాంగ్రెస్, బిజెపిలు ఒప్పందం చేసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇప్పటి వరకూ ప్రజాస్వామికంగా వ్యవహరించామని ఇకపై అలా ఉండేదిలేదన్నారు. డెబ్బై మంది సభ్యులు సమర్థిస్తున్న అవిశ్వాస తీర్మానాన్ని మంగళవారం సభాపతికి ఇస్తామన్నారు. రాజ్యాంగ పరిధిలో పని చేస్తున్న వారు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకపై వ్యూహం మార్చుతామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+