నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచిన్ దత్తత గ్రామంలో రెండోరోజు పీఏలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని శుక్రవారం ఆయన పిఏలు శుక్రవారం కూడా సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాయింట్‌ కలెక్టర్‌ రేఖారాణితో కలిసి పరిశీలించారు.

రచ్చబండ వద్ద మహిళలు, విద్యార్థులతో మాట్లాడారు. ఈ నెల 16న సచిన్‌ గ్రామానికి వస్తున్నారని జేసీ రేఖారాణి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సచిన్ వ్యక్తిగత కార్యదర్శి మనోజ్ వారియా గురువారం నాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారికండ్రిగ గ్రామాన్ని సందర్శఇంచిన విషయం తెలిసిందే.

Sachin's personal secretary visits Nellore

సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన 16వ తేదీన ఇక్కడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పీఏలు మాస్టర్ దత్తత తీసుకున్న గ్రామాన్ని సందర్శించారు. సచిన్ రాక పైన గ్రామస్థులతో చర్చించారు. గ్రామాన్ని పరిశీలించారు.

కాగా, సచిన్‌ టెండూల్కర్‌ 15న ముంబై నుంచి చెన్నైకి విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటారు. అక్కడ కోటి మొక్కల ఉద్యమంలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం 8 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా పీఆర్‌ కండ్రిగకు చేరుకుంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పీఆర్‌ కండ్రిగలోనే సచిన్‌ గడపనున్నారు.

English summary
Sachin Tendulkar's Personal Secretary visits Puttamrajuvarikandriga village on Thursday and Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X