ఫస్ట్ నైట్ వేధింపులు: శాడిస్ట్ భర్త కేసులో కీలక మలుపు, రెండ్రోజుల్లో తేలే ఛాన్స్
చిత్తూరు: శాడిస్ట్ భర్త రాజేష్ - శైలజ కేసు కీలక మలుపు తిరిగింది. భర్తకు పొటెన్సీ టెస్టుకు జిల్లా కోర్టు మంగళవారం అనుమతించింది. హైదరాబాదులో రాజేష్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు చేసే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ పరీక్షలు చేయించనున్నారు.
అతనికి రెండు రోజుల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. నవ వధువు శైలజను తొలి రాత్రి వేధించిన విషయం ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శోభనం రోజు రాత్రి శైలజ గదిలోకి వచ్చిన తర్వాత అతను తాను సంసారానికి పనికి రానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

భార్యకు వేధింపులు
ఆమె ఈ విషయాన్ని అందరికీ చెప్పిందనే కోపంతో అతను శైలజపై తీవ్రంగా దాడి చేసి కొట్టాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన వాదన నిజమేనా అని తెలుసుకునేందుకు రాజేష్‌కు పొటెన్షియల్ టెస్ట్ నిర్వహించనున్నారు.

పలువురి పరామర్శ
మొదటి రాత్రే భార్యను చిత్రహింసలకు గురి చేసిన రాజేష్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. నన్నపనేని రాజకుమారి బాధితురాలిని ఇటీవల పరామర్శించారు. ఆమెకు, ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజేష్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అతను ఎక్కడా చెప్పలేదు
రాజేష్ తాను నపుంసకుడిని అని ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కానీ శోభనం రోజు రాత్రి భార్యకు మాత్రం చెప్పాడని శైలజ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంసారానికి పనికి రానప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడని వారు ప్రశ్నిస్తున్నారు.

భార్యకు ఆఫర్ ఇచ్చి
తొలి రాత్రి భార్యను చిత్రహింసలు పెట్టడానికి ముందు అతను ఆమెకు ఓ ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా ప్రచారం సాగింది. తాను సంసారానికి పనికి రానని, అయితే నీకు ఇష్టం ఉన్న వారితో సంసారం చేయవచ్చునని, నిన్ను నేను భార్యగా బాగా చూసుకుంటానని చెప్పాడని తెలుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications