సాయిరెడ్డిలో సడన్ ఛేంజ్, జగన్ కు తాజా సంకేతాలు - తెర వెనుక..!!

ఏపీలో రాజకీయం ఊహించని మలుపు తిరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన కొత్త వ్యూహాలు అమ లు చేస్తున్నాయి. టీడీపీ నాయకత్వం వైసీపీ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయం లో జగన్ కూటమి ప్రభుత్వం పైన పోరుబాటకు సిద్దమయ్యారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడిన తరువాత జగన్ కు సమస్యలు తప్పవని అందరూ భావించారు. అయితే, సడన్ గా సాయిరెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

సాయిరెడ్డి నిర్ణయంతో
వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడిగా ఉన్న విజయ సాయిరెడ్డి తాజాగా వైసీపీని వీడారు. జగన్ పార్టీ ఆవిర్భావం నుంచి కలిసి పని చేసిన సాయిరెడ్డి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత లెక్కలు మారాయి. ఢిల్లీ - ఏపీ మధ్య జగన్ నమ్మిన బంటుగా సాయిరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో జగన్ సూచన మేరకు నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత పార్లమెంట్ లో సాయిరెడ్డి స్థానంలో సుబ్బారెడ్డిని జగన్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. సాయిరెడ్డిని రాజ్యసభ.. మిథున్ రెడ్డి లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా ప్రకటించారు. వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ కోటరీ కారణంగా తాను పార్టీ వీడు తున్నట్లు సాయిరెడ్డి ప్రకటించి.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

sai-reddy-clarifies-stance-no-actions-or-words-to-hurt-jagan

జగన్ పై అస్త్రంగా
జగన్ తో పాటుగా కేసుల్లో ఉండి.. జైలు కు వెళ్లిన సాయిరెడ్డి వైసీపీతో విభేదించటం తో జగన్ కు కష్టాలు తప్పవనే చర్చ జరిగింది. సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని అందరూ భావించారు. రాజ్య సభకు రాజీనామా తరువాత ఇదే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇక, లిక్కర్ కేసు విచారణ వేళ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కసిరెడ్డి రాజ ఈ మొత్తం స్కాంకు సూత్రధారి అని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక.. సాయిరెడ్డి గురించి జగన్ చేసిన వ్యాఖ్యల పైన సాయిరెడ్డి ఒక దశలో ఘాటుగానే స్పందించారు. జగన్ లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారని సాయిరెడ్డి తన్న సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించిన ఆయన.. తాను జగన్ కు హాని కలిగించే విధంగా వ్యవహరించటం.. మాట్లాడటం జరగదని తేల్చి చెప్పారు.

తాజా సంకేతాలు
జగన్ కు తాను నష్టం చేయనని సాయిరెడ్డి చెప్పటం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది. వైసీపీ నుంచి సాయిరెడ్డి బయటకు వచ్చిన తరువాత చేసిన వ్యాఖ్యలు.. జగన్ స్పందన తో ఇద్దరి మధ్య విభేదాలు కూటమికి కలిసి వస్తాయనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. ఒక దశలో ఇద్దరి మధ్య వార్ తారా స్థాయికి చేరుతుందనే అభిప్రాయం కలిగింది. సాయిరెడ్డి టీడీపీ నేతను కలిసారంటూ వీడియో విడుదల సమయంలోనూ వైసీపీ ఘాటుగా స్పందించింది. అయితే, మారుతున్న సమీకరణాలు.. ఢిల్లీ నేతలతో సత్సంబంధాలు ఉన్న సాయిరెడ్డి అన్ని లెక్కలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే ఈ తరహాలో స్పందించారనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, సాయిరెడ్డి తాను జగన్ కు హాని కలిగించే విధంగా వ్యవహరించనని చెప్పటం తో రానున్న రోజుల్లో ఆసక్తి సమీకరణాలకు ఛాన్స్ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+