పిఠాపురంలో పవన్ స్థానంలో వర్మ పోటీ..!?

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణకు గుడువుగా నిర్ణయించారు. జగన్ ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేనాని పవన్ పిఠాపురం లో ఈ నెల 23న నామినేషన్ దాఖలుకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు బీజేపీ, జనసేన నుంచి పోటీ చేయటం పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. పిఠాపురం లో పవన్ పోటీ పైన సజ్జల కొత్త సందేహం వ్యక్తం చేసారు.

పొత్తులో సఖ్యత లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలనను ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. భీమవరం, అవనిగడ్డలో అదే జరిగిందన్నారు. అనపర్తిలోనూ అదే రకంగా టీడీపీ అభ్యర్దిని బీజేపీలోకి పంపి అక్కడ టికెట్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ, జనసేనకు సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి చంద్రబాబు తమ వారితో పోటీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కు కనీసం రెండేళ్లయినా సీఎం పదవి దక్కాలనేది జనసైనికలు కోరుకుంటున్నారని వివరించారు. చంద్రబాబు పొత్తులో పవన్ కు తొలత 24 సీట్లు ఇచ్చి..చివరకు 21 సీట్లకు పరిమితం చేసారని వ్యాఖ్యానించారు.

Sajjala lashes out Chandra Babu over TDP leaders contesting from BJP and Janasena

పవన్ పోటీ చేయరేమో
పవన్ తమ వారికి పది సీట్లు మాత్రమే ఇప్పించుకున్నారని సజ్జల పేర్కొన్నారు. 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఇచ్చారని చెప్పుకొచ్చారు.పిఠాపురం లో పవన్ పోటీ నుంచి తప్పుకోవచ్చని సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాలనే కారణంతో పవన్ తప్పుకుంటారేమోనని వ్యాఖ్యానించారు. మొత్తం సీట్లలో తన పట్టు ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుందని చెప్పారు. పిఠాపురంలో సైతం పవన్ ను తప్పించి వర్మను దించుతారేమోనని సజ్జల అనుమానం వ్యక్తం చేసారు. చంద్రబాబు ఒక వైపు బీజేపీతో, మరో వైపు కాంగ్రెస్ తో జత కట్టారని విమర్శించారు.

Sajjala lashes out Chandra Babu over TDP leaders contesting from BJP and Janasena

అప్రమత్తంగా ఉండాలి
అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందించిన తమ పార్టీ ఈ ఎన్నికల యుద్దానికి సిద్దమైందని సజ్జల చెప్పుకొచ్చారు. చంద్రబాబు కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జల సూచించారు. టీడీపీకి మద్దతిచ్చే ఎన్నారైలు గ్రామాల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్నారై పేరుతో గ్రామాల్లో సందేహాస్పదంగా తిరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదే విషయంలో వైసీపీ శ్రేణులు అలర్ట్ గాఉండాలని పిలుపునిచ్చారు. బ్యాంకులను మోసం చేసిన వారికి పక్కకన పెట్టుకొని చిరంజీవి మాట్లాడారన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే చిరంజీవి రావచ్చని..ఎవరికీ అభ్యంతరం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+