ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి - సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సామాజిక న్యాయంలో చంద్రబాబువి సున్నా మార్కులని..మోసానికి, వెన్నుపోటు కు ట్రేడ్ మార్క్ గా సజ్జల పేర్కొన్నారు. వైసీపీ నుంచి స్థానిక సంస్థలు..ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఛైర్మన్ నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఒక్క సీటు టీడీపీ, ఆరు స్థానాలు వైసీపీకి దక్కాయి. ఇదే సమయంలో సజ్జల.. మండలిలో వైసీపీ అమలు చేసిన సామాజిక న్యాయం నుంచి వివరించారు.
వైసీపీ నుంచి కొత్తగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇస్రాయిల్, జయ మంగళ వెంకటరమణ, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పెనుమత్స సూర్యనారాయణ రాజు, మంగమ్మలతో ఛైర్మన్ ప్రమాణం చేయించారు. జగన్ తమకు అవకాశం ఇచ్చారని..ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తామని కొత్తగా ప్రమాణం చేసిన ఎమ్మెల్సీలు స్పష్టం చేసారు.

శాసన మండలికి 17 మంది వైసీపీ నుంచి ఎన్నిక అయితే అందులో 10 మంది బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని సజ్జల చెప్పుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తమ తలరాత వాళ్ళే రాసుకునే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జూన్ నాటికి మండలిలో వైసీపీ మెజారిటీ సభ్యులు వెనుక బడిన వర్గాల వారే ఉంటారన్నారు.
బీసీలు చంద్రబాబుకు ఓట్ బ్యాంకు మాత్రమేనని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ, దళిత వర్గాలకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలేదని గుర్తు చేసారు. చంద్రబాబు వెనుక నడిచే ఏ, బీ, సీ టీం లు చేసే ప్రచారంతో తాము పోటీ పడలేమని సజ్జల పేర్కొన్నారు. ప్రజలను భ్రమల్లో పెట్టి వాళ్ళ వర్గం మాత్రమే బాగుపడాలని చూస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రతి చోట చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశావ్ అని అడగాలన్నారు. అమరావతి అంతర్జాతీయ స్కాం...రియల్ ఎస్టేట్ స్కాంగా పేర్కొన్నారు. 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పగలిగే దమ్ము చంద్రబాబు కు లేదని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వంలో ఏం చేశాడో చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని సజ్జల ధ్వజమెత్తారు.
-
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ???












Click it and Unblock the Notifications