అప్పుడు కేసీఆర్ పెద్దన్న పాత్ర .. సీఎం జగన్ పీఎం మోడీకి లేఖ రాసింది అందుకే : సజ్జల వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల వివాదంపై, అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల వివాదం పరిష్కారం కావాలనే ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ లేఖ రాశారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తామని గతంలో చెప్పారని, జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం అని కేసీఆర్ స్వయంగా అన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖపై వివరణ ఇచ్చిన సజ్జల
తాజాగా జల వివాదాల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం వినడం లేదని అందుకే సీఎం వైయస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాల్సి వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే, తెలంగాణ ఏమాత్రం సహకరించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం జగన్ సహకరించారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.

రాయలసీమ నీళ్ల విషయంలో సీఎం కెసిఆర్ పెద్దన్నగా ఉంటానన్నారు
తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు లక్ష్యం అని, గతంలో సీఎం కేసీఆర్ జగన్ చేస్తున్న ఈ ప్రయత్నానికి అంగీకరించారని, ప్రోత్సహించారని సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.రాయలసీమ నీళ్ల విషయంలో సీఎం కెసిఆర్ పెద్దన్న గా ఉంటానని మాట ఇచ్చారని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం నిర్వహించినప్పుడు, ఆ సమావేశంలో తాను కూడా ఉన్నానని గుర్తు చేశారు.

నీటి విషయంలో ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని అన్నది సీఎం కెసిఆర్ నే
ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో రాయలసీమ ప్రయోజనాలు అవసరమని కెసిఆరే స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎందుకు మారాయో అర్థం కావడం లేదని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా తెలంగాణా నాయకులు ఆరోపణలకు దిగుతున్నారని సజ్జల పేర్కొన్నారు. నీటి విషయంలో ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని కెసిఆర్ గతంలో చెప్పారని గుర్తు చేసిన సజ్జల, రాయలసీమ ప్రజల కష్టాలు తనకు తెలుసని కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు.

తెలంగాణా విద్యుత్ ఉత్పత్తితో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిని చేస్తుందని ఆరోపించారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసిన సజ్జల నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 834 అడుగుల నీటి సామర్థ్యం ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టాల్సి ఉండగా, 800 అడుగుల కంటే తక్కువ సామర్థ్యం వద్దే తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టిందని సజ్జల పేర్కొన్నారు. తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వదిలిపెట్టటం వల్ల ప్రకాశం బ్యారేజ్ కి నిత్యం వచ్చి చేరిన నీటిని అలాగే వృధాగా వదిలేయాల్సి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications