షర్మిల లక్ష్యంగా సజ్జల కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతుంది. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఈ సమయంలోనే షర్మిల, చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని, అధికారం కోసం పవన్‌, బీజేపీని వాడుకుంటున్నార‌ని చెప్పారు.

చంద్రబాబు హయాంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను ఎలా మభ్య పెట్టారో అందరూ గుర్తించారని సజ్జల వ్యాఖ్యానించారు. రాజకీయమంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్, బిజెపిని వాడుకుంటున్నారని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. షర్మిల గురించి సజ్జల కీలక అంశాలను ప్రస్తావించారు. షర్మిల మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారన్నారు. షర్మిల స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తుందని ఆరోపించారు. దేశానికి అవినీతి పరిచయం చేసింది చంద్రబాబు అని పేర్కొన్నారు. పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దేనికైనా సిద్ధపడతారని కామెంట్ చేశారు.

Sajjala Ramakrishna Reddy made serious comments over chandra babu and ys sharmila

చంద్రబాబు తన పాలనలో కేంద్ర రాష్ట్ర నిధులను మింగేసారంటూ ఆరోపణ చేశారు. చంద్రబాబు లాంటి అవినీతిపరుడు లేరని ప్రధాని సైతం విమర్శించారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబుతో బిజెపి ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల్లో ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో ఏ ఇంట్లో అడిగినా చెబుతారన్నారు. ఇలాంటి అవినీతిపరుల విషయంలో ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్నారు. ఆయన హయాంలో అవినీతి పరాకాష్టకు చేరినందునే 2019లో ప్రజలు ఓడించాలని చెప్పుకొచ్చారు. అమరావతి స్కాం లాంటిదే ఐఎంజి స్కాం చూడాలని సజ్జల వివరించారు, చంద్రబాబు ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు తెచ్చారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+