అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు తెలంగాణ వ్యూహం ఇదే - సజ్జల : డీఎల్ రవీంద్రారెడ్డిపైన కీలక వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

చంద్రబాబుకు అసలు ఏ అంశంపై క్లారిటీ ఉందో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేసారు. తెలంగాణలో చంద్రబాబు రాజకీయం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ఏ రష్ట్రంలో ఉన్నారో కూడా తెలియడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం మార్కెటింగ్‌ సంస్థ మాదిరిగా తన పార్టీకి డిమాండ్‌ క్రియేట్‌ చేసుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేసారు. డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నట్లుగా తాము భావించటం లేదని స్పష్టం చేసారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం ఎక్కడా క్లారిటీగా చెప్పలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయని వ్యాఖ్యానించారు.

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాట

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాట


గత ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానని చేస్తానని చంద్రబాబు చెప్పారని సజ్జల గుర్తు చేసారు, కేంద్రంలో చక్రం తిప్పుతానని బీరాలు పలికి చతికిలబడ్డారన్నారు. ఇప్పుడు తన పార్టీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకొని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రజలకు సేవ చెయ్యాలి అంటే మంచిదని.. ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదని చెప్పుకొచ్చారు. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని వ్యాఖ్యానించారు. ఏం చేయాలో చంద్రబాబుకు ఎక్కడా స్పష్టత లేదన్నారు. రాష్ట్ర విబజన సమయం నుంచి సీఎం జగన్ ఒక స్పష్టతతో ఉన్నారని వివరించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అభిప్రాయమే జగన్ కు ఉందన్నారు. తనతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి మేలు జరుగుతుందని చెప్పటమే చంద్రబాబు లక్ష్యమని సజ్జల విశ్లేషించారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్

తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్


చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్ లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు. తన పార్టీ నుంచి బీజేపీలోకి పంపించి స్లీపర్‌సెల్‌ మెయింటైన్‌ చేస్తున్నవారికి మాత్రం ఎందుకు పిలుపు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభించారన్నారు. పగలు ఒక మాట.. రాత్రి ఒక మాట.. పార్టీల దగ్గర మాటలు మార్చే చంద్రబాబు లాంటి వ్యక్తి వాల్యూ ఉంటుందని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజనపై ఉన్నట్టుండి చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియదన్నారు. చంద్రబాబుకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు రెండూ తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ఏదో ఒకలా బీజేపీని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నట్లు భావించడం లేదు

డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నట్లు భావించడం లేదు


డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉన్నారని చెప్పిన సజ్జల..ఆయన పార్టీలో ఉన్నట్లు భావించటం లేదన్నారు. అందుకే చర్యలు తీసుకోవటం లేదన్నారు. ట్యాబ్ ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ చేశారని.. ట్యాబ్ ల కొనుగోలులో అవకతవకలకు తావు లేదని స్పష్టం చేసారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే చంద్రబాబు అప్పుడే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్‌లో కులాల వారీగా రిజర్వేషన్లు తీసుకోవడానికి లేదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేసారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం ఎక్కడా క్లారిటీగా చెప్పలేదన్నారు. విశాఖపట్నం రుషికొండలో రహస్యమేమీ లేదన్నారు. రుషికొండలో భవనాల నిర్మాణాలు, రోడ్డు కోసమే తవ్వారని వివరించారు.

English summary
AP Govt Advisor Sajja interesting Comments on TDP Chief Chandra Babu khammam meeting and his strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X