ఎన్నికల వేళ జగన్ బిగ్ స్కెచ్ - చంద్రబాబు సిద్దమేనా..!!
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. పార్టీల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది.మేనిఫెస్టోలు విడదల చేసిన పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ తన మేనిఫెస్టో ను ప్రజల్లోకి పంపాలని నిర్ణయించారు. ప్రచారానికి మిగిలిన సమయంలో తన మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి తీసుకెళ్లేలా కొత్త కార్యక్రమం ప్రారంభించారు. ఇదే తరహాలో చంద్రబాబు తన మేనిఫెస్టోతో ప్రజల్లొకి వెళ్లగలరా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది.
ప్రజల వద్దకు జగన్ మేనిఫెస్టో
తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకూ ప్రచారం నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. జగన్ కోసం సిద్ధం పేరుతో నూతన కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించి 47 వేల బూత్ కమిటీల నిర్మాణం పూర్తయిందని, ప్రతి బూత్‌లోనూ 1 ప్లస్ 10 విధానంలో ఒకlప్రెసిడెంట్, 10 మంది సభ్యులు ఉంటారని పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

'జగన్ కోసం సిద్ధం' ప్రచార కార్యక్రమం వినూత్నంగా, బహుశా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా.. వివిధ సామాజిక వర్గాలకు చెందిన 12 మంది నిరుపేదలను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశామని, వారి పేర్లను ఎన్నికల కమిషన్‌కు సమర్పించామన్నారు.
మేనిఫెస్టో అమలు షెడ్యూల్
బూత్ కమిటీ సభ్యులతో పాటు స్టార్ క్యాంపెయినర్లు జగన్ కోసం సిద్ధం ప్రచార కార్యక్రమంలో పాల్గొని సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఒక్కొక్కరు రెండు ఓట్లు (ఎమ్మెల్యే, ఎంపీ) వేయాలని అభ్యర్థిస్తారని చెప్పారు. గతంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం నడిపించాం. అప్పుడు కూడా చాలా మంది సీఎం వైయస్ జగన్‌కు అండగా ఉంటాం, ఆయనే మా నాయకుడు అంటూ చెబుతూ వచ్చారని వివరించారు. ఎన్నికల ప్రచారం ఫైనల్‌కు చేరిందన్నారు.
ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు ప్రతి గడపకూ వెళ్లి వైయస్‌ఆర్ సీపీని గెలిపించాలని అభ్యర్థిస్తారు. ఒకటి అసెంబ్లీ, మరోకటి లోక్‌సభ అభ్యర్థికి సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తారని చెప్పారు. ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు, 2019-24 మధ్య పూర్తిగా అమలు చేసి, వాటిని కంటిన్యూ చేస్తామని సీఎం వైయస్ జగన్ డిక్లేర్ చేశారో ముఖ్యమైన పాయింట్స్ ఒక పేపర్ స్టాండ్‌లో పొందుపరిచామన్నారు.

చంద్రబాబు బీజేపీని ప్రశ్నించాలి
దీనిలో మరోవైపు క్యాలెండర్ ప్రచురించామని వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని రకాల సాధికారత కల్పించే దిశగా ఈ ఐదేళ్లలో ముందడుగులు పడ్డాయో చెప్పడానికి ఎంపిక చేసిన 12 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తారన్నారు. తాము మేనిఫెస్టోలో చేసేవే ప్రతిపాదించామని వివరించారు. వాలంటీర్లకు పది వేలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు..వీరి స్థానంలో జన్మభూమి కమిటీలను తీసుకొస్తారన్నారు.
చంద్రబాబు మేనిఫెస్టో చూసి బీజేపీ గుండె గుభేల్ అయిందని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంగా చెప్పారు. చంద్రబాబు అడగాల్సింది బీజేపీనేనని వివరించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ఉండదని బీజేపీ చెబుతోందని సజ్జల వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications