చంద్రబాబు పై సజ్జల కీలక వ్యాఖ్యలు - కుప్పంలో జరిగిందిదీ..!!
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాల్సిందేనన్నారు. అమాయకుల ప్రాణాలు బలికావడానికి చంద్రబాబే కారణమని ఫైర్ అయ్యారు. నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదన్నారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందన్నారు.
చంద్రబాబును కుప్పంలో సభలు నిర్వహించవద్దని ఎవరూ చెప్పాలేదని సజ్జల వివరించారు. పోలీసులతో చంద్రబాబు బెదిరింపు ధోరణితో వ్యవహరించారన్నారు. ఇరుకైన ప్రాంతాల్లో మాత్రమే సభలు వద్దని కుప్పంలో చంద్రబాబుకు పోలీసులు సూచించారని చెప్పారు. ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. చంద్రబాబు కుప్పానికి ఓ దండయాత్రలా బయల్దేరారని విమర్శించారు. జరిగిన మారణకాండకు బాధ్యత వహిస్తానని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్ చేసారు. చొక్కా చించుకొని.. రొమ్ము విరుచుకొని ప్రతిపక్ష నేత కుప్పం వీధుల్లో ప్రదర్శనలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఈ రోజు కూడా చైతన్య రథం ఇవ్వాలని ధర్నా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఒక క్రైసిస్ క్రియేట్ చేశాన్నారు.

చట్టాన్ని ఉల్లంఘించి ఆయనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ వచ్చారు. కందుకూరులో పోలీసులు చెప్పిన చోట సమావేశం పెట్టుకుంటే ఈ పరిస్థితి ఏర్పడేదా అని ప్రశ్నించారు. కుప్పంలో టీడీపీ నేతలు వాట్సాప్ ద్వారా ఓ మెసేజ్ డీఎస్పీకి పంపారని వివరించారు. అక్కడ యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పారు. ముందుగా సభ ఎక్కడ నిర్వహిస్తున్నారో చెబితే అనుమతి ఇస్తామని పోలీసులు వెల్లడించారని వివరించారు. కానీ, టీడీపీ నుంచి స్పందన రాలేదన్నారు. చంద్రబాబు పోలీసు అధికారిని వేలు చూపిస్తూ హెచ్చరించారని వివరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని డీఎస్పీ ఎంతో మర్యాదగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు ఇష్టారాజ్యంగా చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అంటూ సజ్జల నిలదీసారు.












Click it and Unblock the Notifications