స్క్లోలింగ్: స్పీకర్‌కు జగన్ సాక్షి టీవి క్షమాపణ

 Sakshi TV seeks apology from speaker
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు క్షమాపణ చెప్పింది. లిఖితపూర్వకమైన క్షమాపణ పత్రాన్ని ఆ టీవీ చానెల్ ప్రతినిధులు స్పీకర్‌కు మంగళవారంనాడు అందించినట్లు సమాచారం

ఎపి శాసనసభా సమావేశాలు వచ్చేసారి విజయవాడలో జరుగుతాయని, ఇప్పుడు జరిగేవే హైదరాబాదులో ఆఖరి సమావేశాలని కోడెల శివప్రసాద రావు అన్నట్లు సాక్షి టీవీ స్క్రోలింగ్ ఇచ్చింది. వాస్తవానికి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పీకర్ మీడియాతో ఇష్టాగోష్టిగా అన్నారు.

సాక్షి టీవీ స్క్రోలింగ్‌తో స్పీకర్ కార్యాలయానికి పెద్ద యెత్తున ఫోన్లు వచ్చాయి. దీంతో స్క్రోలింగ్ వ్యవహారంపై స్పీకర్ కార్యాలయం సాక్షి టీవీ యాజమాన్యానికి నిరసన తెలియజేసింది. దీంతో సాక్షి టీవీ ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

పొరపాటుకు చింతిస్తున్నామని, సభా విలువల పట్ల తనకు గౌరవం ఉందని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని సాక్షి టీవీ ప్రతినిధులు లిఖితపూర్వకంగా స్పీకర్‌కు తెలియజేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+