విష్ణుకు సమైక్య షాక్: షిండేకు అశోక్ బాబు కౌంటర్

ఓపెన్ మైండ్‌తో చర్చలకు: అశోక్ బాబు
తాము బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలకు వెళ్తున్నామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు హైదరాబాదులో చెప్పారు. తాము ఓపెన్ మైండ్‌తో చర్చలకు వెళ్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర జిల్లాల్లో చాలా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు మూతపడ్డాయన్నారు. విజయనగరంలో గురుద్వారాపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
అసెంబ్లీకి తీర్మానం వస్తే తోసిపుచ్చాలని తాము సీమాంధ్ర ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు అదే విషయమై ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వాలని సూచించారు. ఈ నెల 11న లేదా 12న పలు సంఘాలతో భేటీ అయి ఢిల్లీ కార్యక్రమంపై చర్చిస్తామన్నారు. ఆలస్యమైనా నలుగురు కేంద్రమంత్రులు రాజీనామా చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజీనామాలు చేయని ఎంపీల ఇళ్ల ముందు నిరసన తెలిపి ఒత్తిడి తెస్తామన్నారు. మాజీ డిజిపి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు.
షిండేకు అశోక్ బాబు కౌంటర్
విభజన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఉద్యమాలు సహజమే అన్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలకు అశోక్ బాబు కౌంటర్ ఇచ్చారు. సీమాంధ్ర ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు వస్తున్నారనే అంశంపై అశోక్ స్పందించారు. విభజన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి ఉద్యమం ఎంత సహజమో.. ఇలాంటివి జరుగుతున్నప్పుడు సంఘ విద్రోహ శక్తులు ఉండటం అంతే సహజమన్నారు.
వారే మోసం చేస్తున్నారు: పొన్నం
సీమాంధ్ర కేంద్రమంత్రులకు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం కౌంటర్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయిన సీమాంధ్ర కేంద్రమత్రులు తమను పార్టీ మోసం చేసిందని చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పొన్నం స్పందించారు. పార్టీ వారిని మోసం చేయలేదని, వారే పార్టీని మోసం చేస్తున్నారనిధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications