దిగ్బంధం: అంబటి రాంబాబు అరెస్ట్, ట్రాఫిక్ జామ్‌

Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అరెస్టయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ బుధవారం, గురువారం రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అంబటి రాంబాబు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో రోడ్డు పైన రాస్తా రోకో నిర్వహించారు.

ఈ రాస్తారోకోలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేసి పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.

కాగా, సమైక్యాంధ్రపై కేంద్రానికి, మంత్రుల బృందానికి (జివోఎం)కు కనువిప్పు కలిగించడం కోసమే బుధ, గురు రెండు రోజులు రహదారులను దిగ్బంధిస్తున్నట్లు ఆ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఈ రహదారుల దిగ్బంధంలో ప్రజలు, సమైక్యవాదులు అందరూ భాగస్వాములు కావాలని శోభా కోరారు. ఈ రెండు రోజుల పాటు ప్రజలు తమ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కాగా, సీమాంధ్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు పలుచోట్ల రహదారులను దిగ్బంధిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కార్యకర్తలు రహదారులను దిగ్బంధించడంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కడప జిల్లా మైదుకూరులోని ఎన్‌హెచ్ 18, రాజోలు ఎన్‌హెచ్ 216, హైదరాబాదు - గుంటూరు - నర్సారావుపేటల, నెల్లూరు - తిరుపతి తదితర పలు రహదారులను కార్యకర్తలు దిగ్బంధించారు. దీంతో చాలాచోట్ల ట్రాఫిక్ జాం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+