వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజేంద్ర ప్రసాద్‌కు సంపూ కౌంటర్: ఒక్క ఫోన్ కాల్‌తో రెడీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం సినీ పరిశ్రమ స్పందించడం లేదంటూ వ్యాఖ్యానించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు తెలుగు సినీ నటుడు సంపూర్షేష్ బాబు సుతిమెత్తగా సమాధానం చెప్పారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

గతంలో తనను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. సినిమా వాళ్లకు బాధ్యత లేదా అని రాజేంద్ర ప్రసాద్ అనడాన్ని ప్రస్తావిస్తూ అప్పటి విషయాలను గుర్తు చేశారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

గత సంవత్సరం ఇలా జరిగింది...

గత సంవత్సరం ఇలా జరిగింది...

గత సంవత్సరం సోషల్ మీడియాలో యువత వైజాగ్‌లో మానవ హారంగా ఏర్పడి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపు ఇచ్చిందని, అది ఉధృతమైందని, ట్విట్టర్ వేదికగా ఆనాడు తనను నీకు బాధ్యత లేదా, నీ విజయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరణ లేదా అని ప్రశ్నించి తన బాధ్యతను గుర్తు చేశారని, మీరు తలపెట్టబోయే ఉద్యమానికి నేను వస్తానని మాట ఇచ్చానని సంపూర్ణేష్ బాబు గుర్తు చేశారు.

Recommended Video

Kavitha Strongly Responds To Rajendra Prasad Words
 ఆ రోజు ఇలా మద్దతు

ఆ రోజు ఇలా మద్దతు

సినిమావాళ్లకి బాధ్యత లేదా అని ఈ రోజు ప్రశ్నించన గౌరవ రాజేంద్రప్రసాద్ గారికి నేను విన్నవించేది ఏంటంటే... ఆనాడు ఉద్యమానికి సంఘీభావంగా శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, సందీప్ కిషన్ గారు, నిఖిల్ గారు ఇలా ఎందరో యువ హీరోలు మద్దతుగా ట్వీట్లు చేశారని ంపూర్ణేష్ బాబు అన్నారు.

నాకు ఆలస్యంగా తెలిపారు....

నాకు ఆలస్యంగా తెలిపారు....

అంతర్జాతీయ సదస్సు కారణంగా ఆ రోజు కాకుండా వేరొక రోజుకు మీ ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని తనకు ఆలస్యంగా తెలిపారని, కానీ ఆ ఉద్యమానికి నాయకులంటూ ఎవరూ లేరని, యువతే నాయకత్వం వహించిందని, మాట ఇచ్చి సదస్సు వల్ల రాలేకపోతున్నానని చెప్పడం అన్యాయం అవుతుందని, వస్తే అరెస్టు చేస్తారని తెలిసినా వెళ్లానని సంపూర్ణేష్ బాబు వివరించారు.

పోలీసులు నన్ను అరెస్టు చేశారు....

పోలీసులు నన్ను అరెస్టు చేశారు....

అంతర్జాతీయ ప్రతినిధులు విశాఖలో ఉన్నప్పుడు శాంతిభద్రతలు కాపాడడంం ప్రభుత్వం, పోలీసు శాఖ బాధ్యత అని, అందులో భాగంగానే తనను అరెస్టు చేసి సెల్లో పెట్టినట్లు భావిస్తున్నానని, అందులో ఎటువంటి తప్పు కూడా లేదని తాను నమ్ముతున్నానని సంపూర్ణేష్ బాబు అన్నారు.

 ఇప్పటికీ నేను సిద్ధమే...

ఇప్పటికీ నేను సిద్ధమే...

ఆంధ్రప్రదేశ్ విషయంలో, ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంపూర్ణేష్ బాబు తెలిపారు. పార్టీలకు అతీతంా ఎవరు పిలిచినా వరితో కలిసి పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటానని చెప్పారు.

English summary
Telugu cine actor Sampurnesh Babu said that he was ready to fight for the special category status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X