గుంటూరు కారం... పూజా హెగ్డేకు షాకిచ్చిన త్రివిక్రమ్?
ఏ ముహూర్తాన ఈ చిత్రాన్ని ప్రారంభించారో కానీ ఈరోజు వరకు కూడా షూటింగ్ ఏకధాటిగా మాత్రం జరగలేదు. ఏ సినిమాపై రానన్ని గాసిప్స్ ఈ చిత్రంపై వస్తున్నాయి. రోజుకొకటి పుట్టుకొస్తోంది. ఆ సినిమా ఏమిటన్నది మీకిప్పటికే అర్థమయ్యుండాలి.. అదే గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.
నటుల కాల్షీట్లు దొరక్క ఈ సినిమా షూటింగ్ వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇంతలోనే ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్ ను తొలగించారంటూ వార్త వచ్చింది అయితే గుంటూరు కారం యూనిట్ దీన్ని ఖండించింది. తమన్ అరటికాయలను షేర్ చేశారు. కడుపు మంటగా ఉన్నవారు అరటికాయ తినాలని సూచించారు. తమన్ ను తొలగించలేదు.. అనుకుంటున్న తరుణంలో పూజాహెగ్డేను తొలగించారంటూ మరో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించలేదు.

పూజా హెగ్డేను తొలగించి సంయుక్త మీనన్ కు అవకాశం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పూజా హెగ్డే టీమ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. విరూపాక్ష సినిమాలో సత్తా చాటిన సంయుక్త మీనన్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సార్ సినిమా విడుదలైన సమయంలో కూడా సంయుక్త గురించి త్రివిక్రమ్ గొప్పగా మాట్లాడారు. దీంతో గురూజీ సంయుక్తవైపే చూస్తున్నారని టాక్. ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికితోడు సినిమా ఉందా? అటకెక్కించావా? అంటూ బండ్ల గణేష్ పరోక్షంగా త్రివిక్రమ్ గురించి ట్వీట్ చేయడం కూడా మహేష్ బాబు అభిమానుల్లో ఆందోళన పెరగడానికి కారణమైంది.












Click it and Unblock the Notifications