బాబ్బాబు.. మీ బాబుకు ఇచ్చిన ఆన్సర్ చూడండి, మాన్సాస్ ఉద్యోగుల జీతాలపై చంద్రబాబుతో సంచయిత
మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాల అంశంపై మళ్లీ అగ్గిరాజేసింది. జీతాలు ఇవ్వడం లేదు అని విపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. దీంతో సంచయిత కౌంటర్ ఇచ్చారు. బాబు.. మీ బాబుకు తాను ఇచ్చిన సమాధానం చూడాలని కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో మీరు అశోక గజపతిరాజును కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ట్వీట్లకు సంచయిత కౌంటర్
మాన్సాన్ ట్రస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు అని ఇదివరకే లోకేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సంచయిత ప్రతీగా ట్వీట్లు కూడా చేశారు. తాజాగా చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీంతో వారు రోడ్డెక్కి భిక్షాటన చేస్తున్నారని తెలిపారు. 62 ఏళ్ల ట్రస్ట్ చరిత్రలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. 879 కుటుంబాలు రోడ్డెక్కడం ఎప్పుడూ చూడలేదన్నారు. ట్రస్ట్‌ను అప్రదిష్ట పాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
కోట్ల బాండ్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు
ట్రస్ట్‌కు కోట్ల రూపాయల ఆస్తులు, 124 కోట్ల బాండ్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. మరీ ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు. ఇలా కావడానికి కారణం ఎవరు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నలు సంధించారు. ఇలాంటి పరిస్థితికి ట్రస్ట్‌కు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. ముందుజాగ్రత్తగా ట్రస్ట్ కోసం భూములు, బాం్డ్లను పీవీజీ రాజు ఏర్పాటు చేశారని వివరించారు. కానీ అంతటి సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం చూసి బాధ కలుగుతుందన్నారు.
అసత్య ప్రచారాలు వద్దు..
దీనిపై సంచయిత స్పందించారు. డియర్ చంద్రబాబు గారూ అంటూ కౌంటర్ మొదలెట్టారు. ట్రస్ట్ జీతాలకు సంబంధించి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. జీతాలపై ఇదివరకు లోకేశ్ చేసిన ట్వీట్‌కు తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. వీలైతే ఒకసారి చదవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మన్సాన్ ట్రస్టు దుర్వినియోగానికి గురైందని ఆరోపించారు. అప్పుడు అశోక గజపతిరాజును కాపాడిన మీరు.. ఇప్పుడు వివాదాల కోసం కామెంట్లు చేయడం సరికాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగజారి కామెంట్ చేయడం సరికాదన్నారు.
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసింది. 62ఏళ్ల మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా? 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో చూశామా ?ఇప్పుడెందుకిలా ట్రస్ట్ కు అప్రదిష్ట తెచ్చారు? (1/3) pic.twitter.com/6lgUyr1SCe
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 20, 2020












Click it and Unblock the Notifications