రాష్ట్రంలో లోకేష్ కనుసన్నల్లో ఇసుక,మట్టి మాఫియా:కన్నా; ఆపరేషన్ గరుడ కొనసాగుతోంది:శివాజీ
కడప:రాష్ట్రంలో లోకేష్ కనుసన్నల్లోనే ఇసుక, మట్టి మాఫియా నడుస్తోందని ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కడప జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇచ్చేది...తెచ్చేది బీజేపీనేనని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ నీటి ప్రాజెక్టుల మీద లేదని కన్నా ధ్వజమెత్తారు. అందుకే దొంగ దీక్షలు చేసి చైనాకు చెందిన ఒక స్క్రాప్ కంపెనీతో ఉక్కు ఒప్పందం చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని కన్నా ఆరోపించారు. అసలు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతోంది చంద్రబాబే అని, రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్‌తోనే ఆయన జతకట్టారని కన్నా దుయ్యబట్టారు.

అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో ఐదు ప్రశ్నలు సంధిస్తూ 14 వ లేఖను రాశారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అవినీతి, వైఫల్యాల గురించి బిజెపి నేత కన్నా ప్రతి వారం 5 ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఆయన 15 లేఖల్లో ఇప్పటివరకు చంద్రబాబుపై 65 ప్రశ్నలు సంధించగా...తాజాగా 14 వ లేఖలో సంధించిన ఐదు ప్రశ్నలు ఇవి...
66 వ ప్రశ్న:"కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ద్రోహం చేసిందని, నిధులు ఇవ్వటం లేదని దొంగ ధర్మపోరాట దీక్షలు, సమావేశాలు పెట్టి గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చాయని స్వయానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమారే చెప్పారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.9700 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకోగా, రూ.17,500 కోట్ల నిధులు గ్రాంట్ల రూపంలో వచ్చాయని చెప్పారు. 2018-19 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి అంటే 6 మాసాలకే రూ.10,372 కోట్ల గ్రాంట్ వచ్చిందని కూడా చెప్పారు. ఈ ప్రకటనతో మీరు చేస్తున్న ఆరోపణలు, దొంగ దీక్షలు అన్ని మోసపూరితమని అంగీకరిస్తారా? చెంపలు వేసుకుని ప్రజలకు నిజాలను వెల్లడిస్తారా?"...
67 వ ప్రశ్న:"రాష్ర్టంలో అన్ని జిల్లాల్లో మట్టి, ఇసుక, గనులు, దేనినీ వదలకుండా మీ కుమారుడి కనుసన్నలలో కబ్జాలు అయిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట నుంచి కాకరపల్లి వరకు సముద్రతీరాన ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉప్పు శాఖ వారి వేలాది ఎకరాలను టీడీపీ నాయకులు కబ్జా చేసిన మాట వాస్తవం కాదా? దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా?"...
68 వ ప్రశ్న:"ప్రచార ఆర్భాటంలో, ప్రజలను మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో మీరు మీ కుమారులు ఒకరిని మించినవారొకరు అయిపోయారు. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు చైనాలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ప్రసంగించేందుకు మీ కుమారుడికి ప్రత్యేక ఆహ్వానం అందిందని ఎంతో హడావిడి చేశారు. మరయితే ఇందుకు అయిన ఖర్చు అంతా రాష్ట్రమే ఎందుకు భరించవలసి వచ్చిందో చెప్పగలరా? అదీ చాలా తెలివిగా ముందు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీకి 6-7-2018న జీ.ఓ.ఎంఎస్ నెంబర్ 64 ద్వారా 18 కోట్ల రూపాయలు కేటాయించి, మళ్లీ ఆ సంస్థ ద్వారా చైనా ఖర్చులకి 6-9-2018న జీ.ఓ.ఎంఎస్ 1947 ద్వారా భరించిన మాట వాస్తవం కాదా? పెట్టుబడుల ప్రమోషన్లకా లేక మీ కుమారుని ప్రమోషన్‌కా ఈ ఖర్చు అయింది? అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మీ ఇద్దరి దుబారా ఆర్భాటపు ఖర్చులతో ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టడం లేదా?"
69 వ ప్రశ్న:" పులిచింతల కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు విజయవాడలో స్వరాజ్ మైదానాన్ని మీకు కావలసిన బొల్లినేని శీనయ్య కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా కోర్టులో సవాల్ చేయని విషయం వాస్తవం కాదా? పులిచింతల కాంట్రాక్టర్ తాను రూ.199 కోట్ల మేర అదనపు పనులు చేశానని, అందుకు తనకు చెల్లింపులు చేయాలని కోర్టుకి ఎక్కితే రాష్ట్ర ప్రభుత్వం కావాలని సకాలంలో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్‌కు చెల్లించవలసిన మొత్తం రూ.400 కోట్లకు చేరిన మాట వాస్తవం కాదా? ఆ మొత్తం సకాలంలో చెల్లించనందున విజయవాడలోని స్వరాజ్ మైదానం, పులిచింతల కోసం సేకరించిన 48 ఎకరాల భూమిని వేలం వేసి ఆ కాంట్రాక్టరుకు ఆ సొమ్ము చెల్లించాలని మచిలీపట్టణం కోర్టు ఆదేశాలను జారీ చేయలేదా? ఈ మొత్తం కుంభకోణం మీ కనుసన్నలలో జరగలేదా?"
70 వ ప్రశ్న: "అమెరికాలో ప్రకృతి వ్యవసాయం మీద ప్రత్యే ప్రసంగంగా చెప్పబడుతున్న మీ ప్రసంగంలో రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు సెలవిచ్చారు. స్వయానా వ్యవసాయశాఖ మంత్రి అసెంబ్లీలో 2018-19 వ్యవసాయ బడ్జెట్‌పై ప్రసంగిస్తూ ఇప్పటివరకూ 1.63 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ఎవరిది నిజం? ఎవరిది అబద్దం? ప్రజలకు వివరిస్తారా?"...అని తాజాగా చంద్రబాబుపై కన్నాఈ 5 ప్రశ్నలు సంధించారు.

మరోవైపు సినీ నటుడు శివాజీ మరోసారి ఆపరేషన్ గరుడ విషయమై బిజెపిపై విమర్శల వర్షం కురిపించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శించుకున్న శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా రావాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ గరుడ కొనసాగుతోందని శివాజీ స్పష్టం చేశారు. చంద్రబాబును గద్దె దింపేందుకు ఎవరి పాత్రలను వారు సమర్థ౦గా పోషిస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఏపీలో రాజకీయాలు కాదు...కుట్రలు, కుతంత్రాలు సాగుతున్నాయని శివాజీ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని శివాజీ తేల్చి చెప్పారు.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications