చంద్రబాబు పాలనపై విరక్తి వచ్చింది..టీడీపీ అభిమాని ఆవేదన (వీడియో)

ఏపీ రాజకీయాల్లో ఇసుక హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇసుకను ఫ్రీగా అందిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇసుకను ఫ్రీగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగలా నిర్వహించారు. అయితే తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు. ఇసుక ఫ్రీనే కానీ ఆ ఇసుకను లబ్దిదారుడు ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.

దీనిపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక తమ ప్రభుత్వంలోనే చౌకగా దొరికిందని, ఇప్పుడు ఒక టన్నుకు రూ.1300 రూపాయిలు వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక ఫ్రీ విధానంపై కూటమి నేతలు ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ , ఇసుక ఉచితంగా దొరకడం లేదనేది అక్షర సత్యం.

Sand is not available for free in AP - TDP fan

దీనిపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఓ టీడీపీ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఏపీలో ఇసుక ఫ్రీ అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదని, లోకల్ నాయకులు ఇసుకు పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పక్కా టీడీపీ అభిమాని అని, ఓటు కూడా టీడీపీకే వేశానని అతను చెప్పుకొచ్చాడు. టీడీపీ గెలిచిన తర్వాత స్థానిక నేతలు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని, పైన ఉన్న నేతలు ఫ్రీగా ఇవ్వమని చెప్పినా, ఇక్కడి నేతలు మాత్రం ఇసుకపై అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు.

Take a Poll

చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి ఆటో వారి మీద కక్ష్య కట్టారని, సిటీలోకి ఆటోవాళ్లను ఎంటర్ కానివ్వడం లేదని తెలిపారు.20, 30 ఏకరాలు ఉన్న వారికి కూడా ఫించన్లు ఇస్తున్నారని సదరు వ్యక్తి ఆరోపించారు.ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు న్యాయం జరగడం లేదని అతను వాపోయాడు. చంద్రబాబు సీఎం అవ్వగానే రోడ్లు అభివృద్ది చేస్తామని చెప్పారని, కానీ రోడ్లు పరిస్థితి ఇప్పటికీ అలానే ఉండిపోయిందని చెప్పుకొచ్చారు.

జగన ఉచిత పథకాలు ఇవ్వడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.జగన్ హయంలో నాకు పథకాలు అందాయని టీడీపీ అభిమాని తెలిపారు.అలాగే వైసీపీ నేతలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని, వాళ్లు గెలిచినప్పుడు కూడా అలాగే జరిగిందా అంటూ సదరు టీడీపీ అభిమాని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు. మొత్తానికి ఏపీలో పాలన చూసి తనకు విరక్తి వేసిందని సదరు టీడీపీ అభిమాని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+