టిపై కిరణ్‍కు ఢిల్లీ కౌంటర్: సిఎంలు అడ్డుకోలేరని వ్యాఖ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ కౌంటర్ ఇచ్చింది. ఫైలిన్ తుఫానును తాను ఆపలేకపోయానని కానీ విభజన ప్రక్రియను మాత్రం ఆపుతానని ముఖ్యమంత్రి ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట దాటవేశారు. దానిపై స్పందించలేదు.
అయితే ఏఐసిసి అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రులు విభజనను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సందీప్ మాట్లాడారు. విభజన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రెండేళ్ల సంప్రదింపుల తర్వాతనే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం జరిగిందన్నారు.
మంత్రుల బృందం (జివోఎం) సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. సంప్రదింపులు పూర్తయ్యాక ఆ అంశాలను తెలంగాణ బిల్లులో పొందుపరుస్తామని చెప్పారు. విభజన ప్రక్రియను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరన్నారు.

జెడి శీలంకు సమైక్య సెగ
గుంటూరు జిల్లాలోని పొన్నూరులో కేంద్ర సహాయ మంత్రి జెడి శీలంకు సమైక్య సెగ తగిలింది. సోమవారం పొన్నూరు వచ్చిన శీలం కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యంధ్రకు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళన కారులను చెల్లాచెదురు చేశారు. ఈ సందర్భంగా జెడి శీలం మాట్లాడుతూ విభజనతో జరిగే అనర్థాలను కేంద్రానికి వివరించడంలో సమైక్యవాదులు విఫలమయ్యారని అన్నారు. విభజన జరిగిపోయిందని, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. అందరూ ఒప్పుకుంటే ప్రాంతాలు విడిపోవచ్చుకాని, తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ఆయన కోరారు.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications