ఓటుకు నోటు ఎఫెక్ట్?: ఏపీ సచివాలయానికి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం వెళ్లారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం వెళ్లారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సోమవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక, వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య ఏపీ సచివాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సచివాలయానికి వచ్చిన ఆయన పలువురు టీడీపీ నేతలతో తాజా పరిణామాలపై చర్చలు జరిపారు.

ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య ఐదో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ కేసులో బెయిల్‌పై ఉన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.












Click it and Unblock the Notifications