సంగం డెయిరీ కేసు: ఏసీబీ కస్టడీలో ధూళిపాళ్ళ , ఏసీబీ ఆఫీస్ వద్ద కంటతడి పెట్టిన నరేంద్ర కుటుంబం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంగం డెయిరి కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ధూళిపాళ్ల నరేంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఈ కేసులో విచారణను వేగవంతం చేయనున్నారు. నాలుగు రోజుల పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంగం డెయిరి కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ధూళిపాళ్ల నరేంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఈ కేసులో విచారణను వేగవంతం చేయనున్నారు. నాలుగు రోజుల పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

ధూళిపాళ్ళ నరేంద్రను కస్టడీలోకి తీసుకుని విజయవాడ ఏసీబీ ఆఫీస్ కు తీసుకువచ్చిన అధికారులు
సంగం డెయిరీ లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈరోజు ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడకు తరలించారు. ఈ నెల 5 వరకు దూళిపాళ్ల ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తన తండ్రిని కలవడానికి వచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె పోలీసులు ఆయనను కలవడానికి నిరాకరించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉద్వేగ వాతావరణం చోటు చేసుకుంది.

తప్పుడు కేసులు పెట్టారని ఏసీబీ కార్యాలయం వద్ద ధూళిపాళ్ళ సతీమణి ఆరోపణ
సంగం డెయిరీలో అక్రమాలకు సంబంధించి ధూళిపాళ్ల నరేంద్ర ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని,తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ధూళిపాళ్లను కస్టడీకి అనుమతించింది.మరోవైపు ధూళిపాళ్ల నరేంద్ర ను విజయవాడకు తరలించడంతో ఆయన కుటుంబ సభ్యులు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సంగం డెయిరీ లావాదేవీలలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని తప్పుడు ఆరోపణలతో తన భర్త ను అన్యాయంగా అరెస్టు చేశారని ధూళిపాళ్ల నరేంద్ర భార్య జ్యోతిర్మయి కంటతడి పెట్టారు.

జగన్ కక్ష సాదిస్తున్నారన్న ధూళిపాళ్ళ తల్లి ప్రమీలా దేవి
ఇక అక్రమాలు జరిగి ఉంటే విచారణ తర్వాత అరెస్ట్ చెయ్యాలని ,అలా కాకుండా అరెస్ట్ చేసి ముందే లోపల పెట్టి తమను క్షోభకు గురి చేస్తున్నారని ధూళిపాళ్ళ తల్లి ప్రమీలాదేవి ఆవేదన వ్యక్తం చశారు. సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు . కనీసం తన కొడుకును చూడనివ్వకుండా తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్య్నాథం చేశారు .సంగం డెయిరీలో భూబదలాయింపు ఒక మంచి పని కోసం జరిగిందని, అక్కడ ఆస్పత్రి కట్టారని, తమ సొంతానికి భూమిని వాడుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .
Recommended Video

న్యాయవాదిని సైతం ధూళిపాళ్ళను కలవనివ్వని ఏసీబీ అధికారులు , వాగ్దాదం తర్వాత అనుమతి
ఇక ధూళిపాళ్ల ని కలిసేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన న్యాయవాదిని సైతం ఏసీబీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ధూళిపాళ్ళ తరఫు న్యాయవాది రామకృష్ణను ఆయనను కలవడానికి అనుమతించారు ఏసీబీ అధికారులు. ఈనెల 5వ తేదీ వరకు దూళిపాళ్ల విచారణ కొనసాగనున్న నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications