'బండెనక బండి కట్టి... 16 బళ్లు కట్టి..'
వచ్చే ఏడాది జనవరి 14, 15, 16 తేదీల్లో బోగీ, సంక్రాంతి, కనుమ పండగలున్నాయి. 13వ తేదీ శనివారం వచ్చింది. దీంతో 12వ తేదీన ప్రయాణించేందుకు అత్యధిక డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం 10, 11 తేదీల్లోను చాలా రైళ్లల్లో టికెట్లు అందుబాటులో లేవు. తిరుగు ప్రయాణంలోనే ఇదే పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు టికెట్లు అయిపోయాయి. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెయిటింగ్ లిస్టు చూపిస్తోంది. 12వ తేదీ అయితే రిగ్రెట్ అని చూపిస్తోంది. ఇదే మార్గంలో నడిచే గరీబ్ రథ్ రైలులోను ఇదే పరిస్థితి నెలకొంది. 12, 13 తేదీల్లో రిగ్రెట్ చూపిస్తోంది.
సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్ నుమాలో 10, 11 తేదీల్లో వెయిటింగ్ లిస్టు 200 దాటింది. ఈ రైలులో కూడా 12వ తేదీన రిగ్రెట్ చూపిస్తోంది. 13వ తేదీన వెయిటింగ్ లిస్టు జాబితా 300 దాటింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ప్రతి ఏడాది ప్రత్యేక రైళ్లు నడుపుతుంటుంది. అందులో సౌకర్యాలు సరిగా లేకపోవడంవల్ల ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈసారి ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

అన్ని రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొండవీటి చాంతాడంత పొడవు చూపిస్తుండటంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రయివేటు వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించాల్సి ఉంటుంది. వారు భారీస్థాయిలో దోపిడీ చేస్తారు. ఇటువంటి పరిస్థితిని నివారించాలని, కచ్చితంగా అన్ని సౌకర్యాలతో ప్రత్యేక రైళ్లను నడపాలనే డిమాండ్ ఉధృతమవుతోంది.












Click it and Unblock the Notifications