సంక్రాంతికి 'అరిసెలు' పెడుతున్న ఇండియన్ రైల్వే

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడ టౌన్‌, హైదరాబాద్ -తిరుపతి మార్గాల్లో డిసెంబర్‌ 28 నుంచి జనవరి 26వరకు ఇవి నడవనున్నాయి. వీటిల్లో ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

కాచిగూడ -కాకికనాడ టౌన్‌ (07653) గురువారం రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 8.00 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. డిసెంబర్‌ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
కాకినాడ టౌన్‌- కాచిగూడ (07654) శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు కాకినాడలో బయలుదేరి తర్వాతరోజు తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది.

sankranthi special trains details here

ఈ రైళ్లు (రైలు నం.07653/07654) మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

హైదరాబాద్‌ -తిరుపతి (07509) గురువారం రాత్రి 7.25 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. డిసెంబర్‌ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
తిరుపతి - హైదరాబాద్‌ (07510) శుక్రవారం రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.40 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది.

ఈ ప్రత్యేక రైళ్లు (రైలు నం.07509/07510) సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+