రాష్ట్ర పండగగా సంక్రాంతి, అవార్డులు: మంత్రి పల్లె
హైదరాబాద్: సంక్రాంతి సంబరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా గుర్తించినట్లు రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పండగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆ క్రీడల్లో గెలుపొందిన వారికి అవార్డులు అందజేస్తామని చెప్పారు. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు.
23 నుంచి విశాఖ ఉత్సవాలు: మంత్రి గంటా

విశాఖ ఉత్సవ్ నిర్వహణ కోసం ఉడా పార్క్, ఆర్కే బీచ్‌ను ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉత్సవ్ కోసం ప్రధాన వేదికగా ఆర్కే బీచ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. జనవరి 23,24, 25 తేదీల్లో విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముగింపు ఉత్సవాలకు సిఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.
1.3 కోట్ల కుటుంబాలకు చంద్రన్నసంక్రాంతి కానుక: చినరాజప్ప
తూర్పు గోదావరి: రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తొలి సంక్రాంతిని 'చంద్రన్న సంక్రాంతి' కానుకల పేరిట నిరుపేదల ఇళ్లల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిం చుకునేందుకు ప్రభుత్వం కానుకల కిట్స్‌ను ఉచితంగా అందిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల కుటుంబాలకు 27 వేలకు పైగా ఉన్న చౌక దుకాణాల ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుకలను అందిస్తున్నామన్నారు. జిల్లాలో శుక్రవారం శ్రీకారం చుట్టినట్టు మంత్రి చెప్పా రు. కిట్‌లో రూ.230 విలువైన కిలో గోధుమపిండి, శనగలు, అరకిలో చొప్పున కందిపప్పు, బెల్లం, అర లీటరు పామాయిల్, వంద గ్రాముల నెయ్యి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications