వంచన: ప్రియురాలిపై నిద్రలోనే అత్యాచారం
ప్రేమించినవాడు తోడుగా ఉన్నాడనే భరోసాతో ఆదమరిచి నిద్రపోతున్న ఓ యువతిపై నిద్రలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అయితే ప్రతిరోజూ ఇదే తరహలో జరుగుతుండడంతో ప్రేమికుడు నిజస్వరూపం బట్టబయలైంది.
విశాఖపట్టణం: ప్రేమించినవాడు తోడుగా ఉన్నాడనే భరోసాతో ఆదమరిచి నిద్రపోతున్న ఓ యువతిపై నిద్రలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అయితే ప్రతిరోజూ ఇదే తరహలో జరుగుతుండడంతో ప్రేమికుడు నిజస్వరూపం బట్టబయలైంది. బాధితురాలు నిందితుడిపై ఫిర్యాదుచేసింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన దళిత యువతి యానిమేషన్ కోర్సును నేర్చుకొనేందుకుగాను విశాఖపట్టణం వచ్చింది. అయితే బీటెక్ మధ్యలోనే ఆపేసిన సంతోష్ నాయక్ అనే యువకుడితో ఆమెకు పరిచయమేర్పడింది.ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే సంతోష్ నాయకత్ తల్లికి ఆరోగ్యం బాగాలేని కారణంగా తన ప్రేయసిని తన ఇంటికి తీసుకెళ్ళాడు.
తన తల్లికి సపర్యలు చేయించేవాడు.అయితే అదే సమయంలో నాయక్ మరో అమ్మాయితో కూడ ప్రేమాయణం సాగిస్తున్న విషయం దళిత యువతికి తెలిసింది. దీంతో ఆమె నాయక్ తో పలు మార్లు గొడవపడింది.

అయితే ఆమెను శారీరక సుఖం కోసం సంతోష్ నాయక్ పదేపదే ఒత్తిడి చేశాడు. అయితే ఆమె నిరాకరించింది. ఈ సమయంలోనే దళి యువతి నగరంలో ఇల్లు అద్దెకు తీసుకొని వేరుగా నివసిస్తోంది. అయితే తరచూ రాత్రి సమయాల్లో అతను ఆమె ఇంటికి వచ్చేవాడు.
కుటుంబసమస్యలతో పాటు ప్రియుడు సంతోష్ మోసంతో నిద్రమాత్రలు వేసుకొంటే కానీ, ఆ యువతికి నిద్రపట్టకపోయేది.అయితే ఈ అంశాన్ని నిందితుడు అవకాశంగా తీసుకొన్నాడు.
ప్రతిరోజూ ఆ యువతి నిద్రమాత్రలు వేసుకొనేవరకు అతను ఆమెకు అండగా ఉండేవాడు.అయితే ఆ యువతి నిద్రమత్తులోకి జారుకొన్న తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. అంతేకాదు తెల్లవారక ముందే ఆ యువకుడు ఆ ఇంటి నుండి వెళ్ళేవాడు.
అయితే ప్రతిరోజూ తాను నిద్రలేచే సరికి తన దుస్తుల్లో వచ్చిన మార్పును గమనించి అనుమానం వచ్చిన యువతి సంతోష్ ను నిలదీసింది. దీంతో అతడు అసలు విషయం ఒప్పుకొన్నాడు. దీంతో నిందితుడిపై బాధితురాలు నగర కమిషనర్ కు ఫిర్యాదుచేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications