'పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్‌లా వచ్చి సిద్దప్పలా వెళ్తున్నారు, గెస్ట్ ఆర్టిస్ట్‌లా వద్దు'
ఒంగోలు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా బయలుదేరి సిద్దప్పలా వెనక్కి వచ్చేస్తున్నారని ప్రముఖ జర్నలిస్ట్ తెలకపల్లి రవి వ్యాఖ్యానించారని తెలుస్తోంది. శనివారం ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఉంటే రాజకీయాల్లో ఉండాలని లేదంటే, సినిమాలు చేసుకోవాలని హితవు పలికారు. ఆయన ఎవరి తరఫున ప్రశ్నిస్తున్నాడో అర్థం కాకుండా ఉందన్నారు. ప్రశ్నించమని చెబితే ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన జవాబులు బయట చెబితే ఉపయోగమేమిటన్నారు.

చంద్రబాబుకు గెస్ట్‌గా ఉండవద్దని, గెస్ట్ ఆర్టిస్టులా అప్పుడప్పుడు కనిపించి డైలాగులు చెబితే లాభం ఉండదని చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించవద్దని చెప్పారు. రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న చులకన భావాన్ని పవన్ కళ్యాణ్ మరింత తగ్గిస్తున్నారన్నారు.
చంద్రబాబు రాయలసీమకు వెళ్లి తాను సీమ బిడ్డనని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. అమరావతి చుట్టూ 21 నగరాలు నిర్మిస్తామి చెబుతున్నారని, అసలు అమరావతి పట్టణాన్ని ఇంతవరకు పట్టించుకోలేదని ఆరోపించారు. రాజధాని స్టేట్ స్పాన్సర్డ్ సింగపూర్ వెంచర్ అని ఎద్దేవా చేశారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications