షర్మిల పై స్టాండ్ మార్చిన వైసీపీ - కీలక నిర్ణయం..!!
షర్మిల విషయంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. జగన్ తో సహా పార్టీ నేతలు షర్మిల విమర్శలకు సమాధానం చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఆస్తుల వివాదంలో షర్మిల గతంలో చేసుకున్న ఎంఓయూకు భిన్నంగా షేర్ల విక్రయంతో జగన్ సీరియస్ గా తీసుకున్నారు ట్రిబ్యునల్ ఆశ్రయించారు. దీంతో, ఇప్పుడు షర్మిల వెనుక ఉన్న రాజకీయ కోణంతో పాటుగా ఏం జరిగింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ డిసైడ్ అయింది. కేడర్ కు దిశా నిర్దేశం చేసింది.
గిఫ్ట్ డీడ్ దుర్వినియోగం
షర్మిల తన అన్న జగన్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను దుర్వినియోగం.. తల్లి పేరిట షేర్లుగా మార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రోద్భలంతో దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్దే ఉన్నాయని తెలిసే అవి పోయాయని అబద్ధాలాడారని, షర్మిల చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలపై క్రిమినల్ కేసు పెట్టొచ్చని పార్టీ ముఖ్య నేతలు వాదిస్తున్నారు. ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జగన్ ఎన్‌సీఎల్‌టీలో అర్జీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల్లోకి తీసుకెళ్లండి
షర్మిల తీరు ను పార్టీ శ్రేణులకు వివరించారు. సరస్వతి పవర్ షేర్ల మ్యాటర్ హైకోర్టులో ఉందన్నారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులపై స్టేటస్‌కో మెయిన్‌టెయిన్ చేయాలని హైకోర్టు నిర్దేశించిందని తెలిపారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న షేర్లను బదిలీ చేయించు కున్నారు కాబట్టే, దాన్ని ఆపాలంటూ వైయస్ జగన్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ ఇచ్చారని వివరించారు. అంతేతప్ప, ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదన్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే సీఎం చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేశారన్నారు. ఇది తెలిశాక ఆ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమంటూ ఆపాలంటూ చెల్లెలికి వైయస్ జగన్ లేఖ రాశారని చెప్పారు.
అందుకే ట్రిబ్యునల్ కు
ఆమె ససేమిరా అనడంతో న్యాయనిపుణుల అభిప్రాయాన్ని తీసుకొన్నారని తెలిపారు. షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని, దానిని ఆపకుంటే ఇబ్బందులొస్తాయని న్యాయ నిపుణులు చెప్పారన్నారు. ఈ వాస్తవ విషయాలను పార్టీ నాయకులు, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఇదే అంశాలను పార్టీ నేతలు సుబ్బారెడ్డి, పేర్ని నాని, పులివెందుల సతీష్ రెడ్డి, కడప జిల్లా పార్టీ నేతలు వివరించారు. వైఎస్ ఉన్న సమయంలోనే జగన్ పూర్తిగా వ్యాపారాలకు పరిమితం అయ్యారని..షర్మిల వ్యాపారాలు చూడలేదని సతీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన అక్క చెల్లెళ్లకు రూపాయి ఇవ్వలేదని..ఎవరైనా రోడ్డు పైకి వచ్చారా అని ప్రశ్నించారు. వారిని చూసి నేర్చుకోవాలని షర్మిలకు సతీష్ రెడ్డి సూచించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications