దేబిరించడం లేదు, ఆ నిధులకు లెక్కేది: చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తామేమీ దేబిరించడం లేదని ఆయన మండిపడ్డారు.
మంగళవారం ఉదయం రాజమండ్రిలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏపీకి ఇప్పటివరకూ కేంద్రం ఎన్నో నిధులను ఇవ్వగా, వాటిని ఏ విధంగా వాడారన్న విషయాన్ని చెప్పడం లేదని విమర్శించారు.

నిధులను ఎలా వినియోగించారన్న విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీని విమర్శిస్తే, మంత్రి పదవులు పొందవచ్చన్న ఆశతో కొందరు ఎమ్మెల్యేలు అదే పనిగా పెట్టుకుని నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. పొత్తు కోసం తాము పాకులాడటం లేదని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడివుందని స్పష్టం చేశారు.
ఏపీ తరఫున ఉమాభారతి వకాల్తా!: పోలవరంపై ప్రధానికి లేఖ
నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ తరఫున బీజేపీ సీనియర్ నేత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వకాల్తా పుచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల పట్ల అమితాసక్తి ప్రదర్శిస్తున్న ఉమాభారతి.. ఇప్పటికే పలుమార్లు ఆ రాష్ట్రాలకు అనుకూలంగా పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేశారు.
తాజాగా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆమె ఓ లేఖ రాశారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. ఆ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నిధులను కేంద్రమే విడుదల చేయాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications