పవన్ కళ్యాణ్ నీకు మోడీ ఏమిస్తానని చెప్పాడు...?:జూపుడి ప్రభాకర్ ప్రశ్న

అమరావతి: చంద్రబాబు తన రాజ్య సభ సీటు ఇస్తానన్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. పవన్ టిడిపి టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై జూపూడి ప్రశ్నల వర్షం కురిపించారు.అసలు2014 ఎన్నికలకు పవన్ పార్టీ రిజిస్ట్రేషన్ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు నువ్వు ఒక్కడివవే రాజ్య సభ కు వెళ్లాలనుకున్నవా?...అని అడిగారు.మరైతే ఇప్పుడు ప్రధాని మోడీ నీకు ఏమి ఇస్తానని చెప్పాడో వెల్లడించాలని కోరారు. అసలుపవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి ఎందుకు వెళ్ళాడో కూడా అర్ధం కావడం లేదన్నారు.వైసీపీ జనసేన లకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు.

 SC Corporation chairman fire over Pawan Kalyan

టీడీపీ కన్నా ముందు నుంచే మోడీ తెలుసని చెబుతున్న పవన్ కళ్యాణ్...మరి అవిశ్వాసం పెట్టినపుడు పవన్ ఎక్కడ పడుకున్నాడని జూపూడి దుయ్యబట్టారు.అమరావతి కి మట్టి నీళ్లు ఇచ్చిన మోడీది యూ టర్న్ కాదా?...అని జూపూడి ప్రశ్నించారు. వైసీపీ జనసేన...ప్రధాని మోడీ కి జోడెద్దులు గా మారిపోయారన్నారు.బషీర్ బాగ్ లో జరిగిన ఉద్యమాలు భూమి కోసం కాదన్నారు. దీన్ని బట్టిపవన్ కు అసలు రాజకీయ అవగాహన ఉందా...లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+