అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు..
Special Trains: వచ్చే పండగ సీజన్ లల్లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

శ్రావణ పౌర్ణమి నాడు తమిళనాడులోని ప్రఖ్యాత శైవక్షేత్రం అరుణాచలాన్ని సందర్శించే భక్తుల కోసం తాజాగా నర్సాపూర్ నుంచి తిరువణ్ణామలైకి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇది వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్. ఈ నెల 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ఈ నెల 9, 16, 23, ఆగస్టు 6, 13, 20, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో ప్రతి బుధవారం..నర్సాపూర్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరే నంబర్ 07219 ప్రత్యేక రైలు.. మరుసటి రోజు తెల్లవారు జామున 4:55 నిమిషాలకు తిరువణ్ణామలైకి చేరుకుంటుంది.
ఈ నెల 10, 17, 24, జులై 7, 14, 21, ఆగస్టు 5, సెప్టెంబర్ 25 తేదీల్లో ప్రతి గురువారం తిరువణ్ణామలై నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరే నంబర్ 07220 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ కు రిజర్వేషన్ ఈ ఉదయం నుంచి ఆరంభమైంది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications