వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెలిఫోన్ సంభాషణం జస్టిస్ ఈశ్వరయ్య పిటీషన్‌పై సుప్రీంకోర్టులో: తీర్పు రిజర్వ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య దాఖలు చేసిన అప్పీల్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణను ముగించింది. జిల్లా జడ్జి రామకృష్ణతో జరిపిన ఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఇదివరకే నిరాకరించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది. ఆయన దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ జస్టిస్ రామకృష్ణతో తాను నిర్వహించిన టెలిఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు సమగ్ర విచారణ నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వడాన్ని ఈశ్వరయ్య.. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల వేళ..తమిళనాడులో వైఎస్ జగన్ భారీ కటౌట్: సీఎం పళనిస్వామి సహాఅసెంబ్లీ ఎన్నికల వేళ..తమిళనాడులో వైఎస్ జగన్ భారీ కటౌట్: సీఎం పళనిస్వామి సహా

దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఆయన అప్పీల్ చేశారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వాదోవవాదాలను ఆలకించింది. జస్టిస్ ఈశ్వరయ్య తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తమ వాదనలను వినిపించారు.

SC reserves its verdict on petition filed by former AP HC judge Justice Eswariah

జస్టిస్ ఈశ్వరయ్యకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై కపిల్ సిబల్ వాదనలను వినిపిస్తూ.. జస్టిస్ రామకృష్ణతో ఈశ్వరయ్య జరిపిన సంభాషణను ఎడిట్ చేశారనడంలో అర్థం లేదని అన్నారు. ఎడిట్ చేశారనే విషయాన్ని ఎవరూ నిర్ధారించలేదని చెప్పారు. జస్టిస్ రామకృష్ణతో ఈశ్వరయ్య జరిపిన సంభాషణ వెనుక ఎలాంటి మర్మం లేదని, ప్రెస్ కాన్ఫరెన్స్‌లల్లో పలువురు ప్రస్తావించిన అంశాలనే ఆయన కూడా జస్టిస్ రామకృష్ణతో చర్చించారని ప్రశాంత్ భూషణ్ వాదించారు. వాదనలను విన్న తరువాత.. ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటీషన్‌పై వాదనలు ముగిసినట్లు తెలిపింది.

English summary
Supreme Court reserves its verdict on petition filed by former Andhra Pradesh HC judge Justice Eswariah challenging the AP HC's order directing for an inquiry against him into an alleged telephonic conversation between him and a Dist Judge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X