నేడు వైసీపీలోకి కారెం శివాజీ: ఎస్సీ.. ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా: జగన్ సమక్షంలో..!

ఏపీ ఎస్సీ.. ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో మంతనాలు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కారేం శివాజీతోపాటు తొమ్మిది మందికి సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం. చంద్రబాబు హాయంలో కారెం శివాజీ ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా నియమితులయ్యారు. ఆయన నియామకం దగ్గర నుండి న్యాయపరమైన వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక దశలో న్యాయస్థానం ఆయన నియామకాన్ని తప్పు పట్టింది.

ఆ తరువాత తిరిగి న్యాయ పరంగా పోరాటం కొనసాగిస్తూ.. ఆ పదవిలో ఆయన కొనసాగారు. ఇక, ఏపీలో ప్రభుత్వం మారి.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన అదే పదవిలో కొనసాగారు. కాగా, గురువారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి వేరు వేరుగా లేఖలు రాశారు.

కారెం శివాజీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసారు. ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ నేతలతో కలిసి నడిచారు. ఆ తరువాత టీడీపీకి అనుబంధంగా వ్యవహరించారు. దీంతో..ఆయనకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకమైన ఎస్సీ..ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు.

SC..St Corporation ex Chairman Karem Sivaji join in YSRCP..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో వైసీపీలో ఉంటూ..టీడీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ సైతం కొద్ది రోజుల క్రితం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కానీ, ఆయన గతంలో వలే పార్టీలో యాక్టివ్ గా వ్యవహరించటం లేదు. జూపూడి వైసీపీలో చేరే సమయంలో కొందరు పార్టీ నేతలు.. పార్టీ కేడర్ వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు.

అయితే, జూపూడి తాను ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకే పని చేస్తానని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు కారెం శివాజీ కోసం గోదావరి జిల్లాలకు చెందిక ఒక సీనియర్ మంత్రి ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు నిర్వహించిన ధర్మ పోరాట దీక్షల సమయంలో ఆయన వెంటే ఉన్నారు.

గతంలో పలుమార్లు విపక్ష నేతగా ఉన్న జగన్ పైన అనేక విమర్శలు చేసారు. ఇక, ఇప్పుడు మంత్రి జోక్యంతో ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆయన గత ప్రభుత్వంలో దక్కిన నామినేటెడ్ పదవికి రాజీనామా చేసారు. తన సన్నిహితులతో కలిసి ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+