ys vivekanandareddy : వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ-సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఏపీలో 2019లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు సాగుతున్న తీరు, దర్యాప్తు అధికారులకు రాజకీయ బెదిరింపులు, వివేకా కుమార్తె విజ్ఞప్తి వంటి పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

వివేకా కేసు తెలంగాణకు బదిలీ
ఏపీలో మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు స్ధానిక పోలీసుల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, రాజకీయ బెదిరింపులు వంటి కారణాలతో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తు జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ నుంచి ఈ కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేసింది.

తెలంగాణ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ
ఈ కేసును ఇప్పటివరకూ ఏపీలో కడప, పులివెందులకోర్టులతో పాటు హైకోర్టు కూడా పర్యవేక్షిస్తోంది. అయితే ఇంత పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఈ కేసులో నిందితులతో పాటు అప్రూవర్ గా మారిన దస్తగిరికి కూడా భద్రత లేకుండా పోయింది. వీరు పలుమార్లు ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న ఈ కేసు దర్యాప్తును ఇకపై తెలంగాణలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసు తరహాలోనే సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసు కూడా విచారణ జరగబోతోంది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఇప్పటివరకూ ఏపీలో సాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హతుడి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించే సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో సాగుతున్న వీచారణపై మృతుడి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కుల్ని పరిగణనలోకి తీసుకుని కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఇవాళ ప్రకటించింది. ఈ బదిలీతో ఇకపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఈ కేసును విచారిస్తుందని వెల్లడించింది.

సునీతారెడ్డి అభ్యంతరాలివే?
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయంలో కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇందులో ప్రధానమైనది తన తండ్రి హత్య కేసులో సాక్ష్యులుగా ఉన్న వారిని సీబీఐ అరెస్టు చేసిన నిందితులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు నత్త నడకన సాగుతోందని ఆరోపించారు. అలాగే తన వాంగ్మూలంలో సైతం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే తప్ప ఇందులో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. అలాగే విచారణ సందర్భంగా తెలంగాణకు ఈ కేసు బదిలీ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు. ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications