విజయవాడ, బందరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
ఏపీలోని విజయవాడ, మచిలీపట్నం ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగల సీజన్ లో అయోధ్యకు వెళ్లే వారితో పాటు హైదరాబాద్ లోని కాచిగూడకు ప్రయాణాలు చేసే వారికి ఇది వర్తించనుంది. పండుగల సీజన్ లో రైళ్ల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఆయా స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను (special trains) ప్రకటించింది. అయితే ఈ రైళ్లు కేవలం ఒకేవైపు మాత్రమే ప్రయాణిస్తాయి. వీటి వివరాలు ఓసారి తెలుసుకుందాం..
ముందుగా అయోధ్యలో జరిగే మాఘ మేళా సందర్భంగా మచిలీపట్నం నుంచి ప్రయాగ్ రాజ్ కు ఈ నెల 22న దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు (నంబర్ 07401)ను ప్రకటించింది. ఇది మచిలీపట్నంలో సాయంత్రం 4.20కు బయలుదేరి 4.58కు గుడివాడలో, 6 గంటలకు విజయవాడలో, 7.45కు ఖమ్మంలో, 9.45కు వరంగల్ లో, రాత్రి 11.50కు పెద్దపల్లిలో, అర్ధరాత్రి 12.35కు మంచిర్యాలలో, 1.40కి సిర్పూర్ కాగజ్ నగర్ లో 3.40కి బల్లార్షాలో ఆగుతుంది. ఇలా ప్రయాణిస్తూ ప్రయాగ్ రాజ్ లో రెండో రోజు ఉదయం 4.30కు చేరుకుంటుంది. ఇందులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ లోని కాచిగూడకు మరో ప్రత్యేక రైలును ఈ నెల 20న నడుపుతున్నారు. ఈ రైలు విజయవాడలో శనివారం రాత్రి 9.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలుకు గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లిలో స్టాప్ లు ఇచ్చారు. అలాగే ఈ ప్రత్యేక రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంచారు. ఇది కూడా ఒకే వైపు ప్రయాణించే రైలు మాత్రమే.












Click it and Unblock the Notifications