రైల్వే అలర్ట్ - తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు..!!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు..దారి మళ్లిస్తూ అధికారులు ప్రకటన చేసారు. ఖాజీపేట సెక్షన్‌లో పరిధిలో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ నెల 21 నుంచి జూన్ 7వ తేదీ వరకు పలు రైళ్ల షెడ్యూల్ లో మార్పులు చేసారు. కాజీపేట-కొండపల్లి సెక్షన్ పరిధిలోని చింతపల్లి- నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టాల్సి ఉండటంతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
రద్దయిన సర్వీసులు : ట్రైన్ నంబర్ 07753 కాజీపేట డోర్నకల్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07754 డోర్నకల్ -కాజీపేట ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07755 విజయవాడ-డోర్నకల్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07756 డోర్నకల్ - విజయవాడ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07464 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07465 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను మే 21 నుంచి జూన్ 7వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 17660 భద్రాచలం రోడ్ - సికింద్రాబాద్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 17659 సికింద్రాబాద్ - భద్రాచలం రోడ్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 12713 విజయవాడ-సికింద్రబాద్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నంబర్ 12714 సికింద్రాబాద్- విజయవాడ ఎక్స్ ప్రెస్ మే 21 నుంచి జూన్ 7వరకు రద్దు అయ్యింది.

పాక్షింగా రద్దు చేసినవి : రైలు నంబర్ 17034 సిర్పూర్ టౌన్ -భద్రాచలం రైలును మే 20 నుంచి జూన్ 6వరకు వరంగల్-భద్రాచలం మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17033 భద్రాచలం-బలార్షా రైలును మే 21 నుంచి జూన్ 7వరకు భద్రాచలం - వరంగల్ మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07335 బెల్గావి-మణుగూరు రైలును మే 20 నుంచి జూన్ 6వరకు కాజీపేట-మణుగూరు మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07336 మణుగూరు-బెల్గావి రైలును మే 21 నుంచి జూన్ 7 వరకు మణుగూరు-కాజీపేట మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07091 కాజీపేట తిరుపతి, ట్రైన్ నంబర్ 07092 తిరుపతి -కాజీపేట రైలును మే 23, 30, జూన్ 6 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07185 మచిలీపట్నం-సికింద్రాబాద్, ట్రైన్ నంబర్ 07186 సికింద్రాబాద్-మచిలీపట్నం రైలును మే 21, 28, జూన్ 4 తేదీలలో రద్దు చేశారు.
దారి మళ్లింపు : ట్రైన్ నంబర్ 18519 విశాఖపట్నం-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలును మే 21నుంచి జూన్ 6 మధ్య కాలంలో విజయవాడ-గుంటూరు-పిడుగురాళ్ల-సికింద్రాబాద్ మార్గంలో నడుపుతారు. గుంటూరులో మీదుగా నడవనుంది. ట్రైన్ నంబర్ 22849 షాలిమార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ మే 24, 31 తేదీలలో సికింద్రాబాద్-పగడిపల్లి-గుంటూరు-విజయవాడ మీదుగా ప్రయాణిస్తుంది. గుంటూరులో స్టాపేజీ కల్పిస్తారు. ట్రైన్ నంబర్ 18113 యశ్వంతపూర్-టాటానగర్ రైలును మే 21, మే 28, జూన్ 4 తేదీలలో దారి మళ్లిస్తారు. సికింద్రాబాద్-పగిడిపల్లి-గుంటూరు-విజయవాడ మార్గంలో ప్రయాణిస్తుంది. వరంగల్, ఖమ్మం స్టేషన్లకు బదులు గుంటూరులో రైలు ఆగుతుంది. ట్రైన్ నంబర్ 18046 హైదరాబాద్ -షాలిమార్ ఎక్స్‌ప్రెస్ మే 28, జూన్ 7 తేదీలలో విజయవాడ-గుంటూరు-సికింద్రాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది.












Click it and Unblock the Notifications