విజయవాడ మీదుగా రైల్లో వెళ్తున్నారా - మీకోసమే ఈ అలర్ట్..!
ఏపీలోని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారడంతో నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీని ప్రభావం రవాణా రంగంపైనా పడింది. ఇప్పటికే పలు బస్సు సర్వీసులు రద్దు కాగా.. రైల్వే అధికారులు కూడా స్పందించి పలు సర్వీసులు రద్దు చేస్తున్నారు. తాజాగా విజయవాడ రైల్వే డివిజన్ నుంచి రాకపోకలు సాగించే 20 రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందులు పలు దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు కూడా ఉన్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజుల పాటు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. వీటిలో ఇవాళ విజయవాడ-కాకినాడ పోర్టు, నరసాపురం-గుంటూరు, గుంటూరు-రేపల్లె, రేపల్లె-గుంటూరు, గుంటూరు-విజయవాడ, విజయవాడ-నరసాపురం రైళ్లు ఉన్నాయి. రేపు విజయవాడ-తెనాలి, తెనాలి-విజయవాడ, విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ సర్వీసులు రద్దు అయ్యాయి.
అలాగే ఇవాళ, రేపు రద్దయిన రైళ్లలో తెనాలి-రేపల్లె, రేపల్లె-తెనాలి, మచిలీపట్నం-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు, నిడదవోలు-భీమవరం, ఒంగోలు-విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-ఒంగోలు సర్వీసులు ఉన్నాయి. ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం పరిస్ధితి ఆధారంగా ఆయా రైళ్లను పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications