వందేభారత్ సహా పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు..!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ దెబ్బ తింది. పలు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే ట్రాక్ లకు వరద నీటి కారణంగా నష్టం జరిగింది. ట్రాక్ దెబ్బ తినటంతో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే దాదాపు 24 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరి కొన్నింటిని దారి మళ్లించింది. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ను రద్దు చేసారు. ఏపీ ఎక్స్ ప్రెస్ ను దారి మళ్లించారు. ట్రాక్ మరమ్మత్తు పనులను యుద్ద ప్రాతిపదికన ప్రారంభించారు.
భారీ వర్షాలతో
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేసారు. విజయవాడ కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి వరద నీరు చేరడంతో 24 రైళ్లను నిలిపివేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్ ప్రెస్, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి సమీపంలో పట్టాలపై కంకర కొట్టుకుపోయింది. దానిని చూసిన రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఆ సమీపంలో విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగిపోయి కనిపించాయి.

వందేభారత్ రద్దు
రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. అందులో 17202 - సికింద్రాబాద్ - గుంటూరు (గోల్కొండ ఎక్స్ ప్రెస్), 17201 గుంటూరు - సికింద్రాబాద్ (గోల్కొండ ఎక్స్ ప్రెస్), 20708 విశాఖ - సికింద్రాబాద్ (వందేభారత్), 12713 విజయవాడ - సికింద్రాబాద్ (శఆతవాహన), 12714 సికింద్రాబాద్ - విజయవాడ (శాతవాహన), 17233 సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్ నగర్ (భాగ్యనగర ఎక్స్ ప్రెస్), 12706 సికింద్రాబాద్ - గుంటూరు (ఇంటర్ సిటీ), 12705 గుంటూరు - సికింద్రాబాద్ ( ఇంటర్ సిటీ) రద్దయ్యాయి.
రద్దయిన రైళ్లు
వీటితో పాటుగా 12704 సికింద్రాబాద్ - హౌరా (ఫలక్ నుమా), 12703 హౌరా - సికింద్రాబాద్ (ఫలక్ నుమా), 17230 సికింద్రాబాద్ - తిరువనంతపురం (శబరి) 17229 తిరువనంతపురం - సికింద్రాబాద్ ( శబరి), 12862 మహబూబ్ నగర్ - విశాఖ (సూపర్ ఫాస్ట్), 17058 లింగంపల్లి - ముంబాయి ( దేవనగిరి ఎక్స్ ప్రెస్), 17057 ముంబాయి -లింగంపల్లి (దేవనగరి ఎక్స్ ప్రెస్), 12762 కరీంనగర్ - తిరుపతి (సూపర్ ఫాస్ట్) ను రద్దు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ట్రాక్ ల పనులు పూర్తయిన తరువాత రైళ్లను తిరిగి పునరుద్దరించనున్నారు.












Click it and Unblock the Notifications