శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-టైమింగ్స్, స్టాప్ లు ఖరారు..!
శ్రీకాకుళం (srikakulam) వాసులకు రైల్వే తాజాగా శుభవార్త చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతికి (tirupati) వెళ్లే ప్రయాణికుల కోసం వారానికోసారి రాకపోకలు సాగించే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించబోతోంది. కేంద్రం ఈ మేరకు అంగీకారం తెలిపిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ రైలు ఎప్పుడు ప్రారంభం కానుంది, ఏయే స్టాప్ లలో ఆగబోతోంది, కోచ్ లు, ఇతర వివరాలను వెల్లడించింది.
శ్రీకాకుళం వాసులు తిరుపతి వెళ్లాలంటే విశాఖ వరకూ వచ్చి అక్కడి నుంచి మరో రైలు ఎక్కాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి తిరుపతికి కొత్తగా హమ్ సఫర్ (humsafar )ఎక్స్ ప్రెస్ రైలును రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ రైలు శ్రీకాకుళం నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకోనుంది. అయితే ఇది వారానికోసారి మాత్రమే రాకపోకలు సాగించనుంది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి ఓ రైలు, మళ్లీ తిరుపతి నుంచి శ్రీకాకుళానికి మరో రైలు రాకపోకలు సాగిస్తాయి.

శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి వెళ్లే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17440 ఏప్రిల్ 13న ప్రారంభం కానుంది. ఇది శ్రీకాకుళం రోడ్డులో ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మంగళవారం ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది.

🚆 New journey begins!
— South Central Railway (@SCRailwayIndia) April 10, 2026
Weekly Tirupati – Srikakulam Road – Tirupati Humsafar Express by South Central Railway is here to make travel smoother and more comfortable. 🌟
🗓️ Starting April 2026
📍 Connecting Tirupati ↔ Srikakulam Road
🛏️ 3AC & Sleeper coaches
Travel made easier… pic.twitter.com/SufO909poC
అలాగే తిరుపతి నుంచి హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17439 ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రతీ ఆదివారం సాయంత్రం 4.55కు తిరుపతిలో బయలుదేరుతుంది. అక్కడి నుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్ల కోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి మీదుగా శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు సోమవారం మధ్యాహ్నం 12.30కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్ లు మాత్రమే ఉంటాయి.
-
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
మూడు జోన్లుగా తిరుమల -
తిరుమలలో ఆకస్మిక తనిఖీల్లో.. -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు














Click it and Unblock the Notifications