దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్టేషన్ల వివాదంపై కేంద్రం క్లారిటీ..! తల్లీ బిడ్డా న్యాయం ?
ఏపీ విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ (south coast railway zone) లో సరిహద్దులు, స్టేషన్ల విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు కోస్తా రైల్వే జోన్ లో పలు స్టేషన్లు ఇందులో కలపడం, విడదీయడం వంటి నిర్ణయాలతో ఆదాయంపైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ దక్షిణ కోస్తా రైల్వే జోన్ సరిహద్దులు, స్టేషన్లపై పూర్తి స్పష్టత ఇచ్చింది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్తగా సృష్టిస్తున్నామని, దీని ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ జోన్‌లో చేర్చిన స్టేషన్ల గురించి కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయని, వాస్తవ పరిస్థితిపై క్లారిటీ ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందులో పలాస -ఇచ్ఛాపురం సెక్షన్ (50 కి.మీ.)లో పలాస, సుమ్మదేవి, మందస రోడ్, బరువ, సోంపేట, ఝాడూపూడి, ఇచ్ఛాపురం అనే 7 స్టేషన్లు ఉన్నాయని, ఈ స్టేషన్లన్నీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయన, ఈ స్టేషన్లలో ఏదీ ఒడిశా పరిధిలో లేదని తెలిపింది. ఈ స్టేషన్లు చిన్న, మధ్య తరహా స్టేషన్లని, ఇవి ప్రధానంగా ప్రయాణీకుల రద్దీ కోసమేనని, వీటిలో ఏదీ ప్రధాన సరుకు రవాణా కేంద్రం కాదని తెలిపింది. దీంతో తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆదాయం ప్రభావితం కాదని పేర్కొంది.

ఈ స్టేషన్లు ఏ జోన్ పరిధిలోకి వచ్చినా, వాటి గుండా వెళ్లే సరుకు రవాణా (రైళ్లు) నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపింది. జోనల్ సరిహద్దుల అంతటా రైల్వే కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, రైలు సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని వెల్లడించింది. పలాస-భువనేశ్వర్, పలాస-కటక్, ఇచ్ఛాపురం-కటక్ MEMU/ప్రయాణీకుల సర్వీసులతో సహా ప్రస్తుతం ఉన్న అన్ని రైళ్లు షెడ్యూల్, మార్గం లేదా ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పు లేకుండా యధావిధిగా నడుస్తాయని తెలిపింది.

విశాఖపట్నం డివిజన్‌లో ప్రయాణీకుల సేవలు సజావుగా సాగేలా చూసేందుకు ఇది ఒక సాంకేతిక ఏర్పాటు మాత్రమేనని తెలిపింది. సిబ్బంది నియామకంతో సహా బదిలీకి సంబంధించిన విధివిధానాలను తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వో జోన్ల SCoR మధ్య ఖరారు చేస్తున్నట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం రైల్వే ఉద్యోగులందరి ప్రయోజనాలు, సేవా నిబంధనలు పూర్తిగా పరిరక్షిస్తామని హామీ ఇచ్చింది. ఒడిశా పట్ల ప్రభుత్వ నిబద్ధత అచంచలమైనదని, ఒడిశాలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, స్టేషన్ల ఆధునీకరణ, వందే భారత్ సేవలు, తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్‌పై రికార్డు స్థాయిలో మూలధన వ్యయం చేయడం ఈ నిబద్ధతకు నిదర్శనమని తెలిపింది.












Click it and Unblock the Notifications