summer special trains : కాచిగూడ-కాకినాడ-తిరుపతి మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు..వివరాలివే..
తెలుగు రాష్ట్రాల్లో వేసవి సీజన్ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఇప్పటికే దక్షిణ మధ్య పలు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అయినా రద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ మరికొన్ని రైళ్లను ప్రకటించింది. వీటిని రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలైన కాచిగూడ, కాకినాడ, తిరుపతి మధ్య నడపాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన వివరాల్ని అధికారులు ప్రకటించారు. వీటిలో జనరల్ తో పాటు స్లీపర్, ఏసీ టూ టైర్, త్రీటైర్ బోగీలు ఉంటాయి.
కాచిగూడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి కాకినాడ అలాగే కాకినాడ నుంచి కాచిగూడ మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అంటే 25 వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఈ రైళ్లు నడపబోతోంది. వీటిలో సాధారణ రైళ్ల కంటే ఎక్కువగా ఛార్జీల్ని వసూలు చేస్తారు. ఈ రైళ్లు ఏయే తేదీల్లో ఏ సమయాల్లో బయలుదేరి ఏ సమయాల్లో గమ్య స్ధానాల్ని చేరుకుంటాయో ఓసారి చూద్దాం..

రేపు అంటే ఈ నెల 25న కాచిగూడ తిరుపతికి ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. రాత్రి 10గంటల 10 నిమిషాలకు కాచిగూడలో బయలుదేరే ప్రత్యేక రైలు ఎల్లుండి అంటే శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే ఈ నెల 26న తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు 27న తెల్లవారు జామున 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.

అలాగే ఈ నెల 27న కాచిగూడలో రాత్రి 8.45కు బయలుదేరే ప్రత్యేక రైలు 28న ఉదయం 8.45కు కాకినాడ టౌన్ స్టేషన్ కు చేరుకుంటుంది. అలాగే ఈనెల 28న ఆదివారం కాకినాడ టౌన్ లో రాత్రి 9.55కు బయలుదేరే ప్రత్యేక రైలు.. సోమవారం అంటే 29న ఉదయం 9.45కు కాచిగూడ చేరుకుంటుంది. అలాగే ఈ రెండు రైళ్లు కాజీపేట, వరంగల్, మహబాబూబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి.












Click it and Unblock the Notifications