నరసాపూర్ నుంచి బెంగళూరుకు.. ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు

Special Trains: శ్రావణమాసం రాకతో పండగ సీజన్ ఆరంభమైంది. ఈ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

SCR to run Special Trains between Narasapur and Bengaluru

దసరా, దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి తాజాగా నరసాపూర్ నుంచి బెంగళూరుకు 26 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్, ఇతర వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో నరసాపూర్ నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

  • అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నిమిషాలకు నరసాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 07153 ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు ఉదయం 10:50 నిమిషాలకు సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరుకు చేరుకుంటుంది.
  • అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు శనివారం ఉదయం 10:50 నిమిషాలకు ఎస్ఎంవీటీ బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 07154 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు నరసాపూర్ కు చేరుకుంటుంది.
  • పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, కుప్పం, బంగారుపేట్, కేఆర్ పురం మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+