రిషికొండలో సముద్రం ముందుకు, ఆందోళన: ఖైరతాబాద్‌కు తాపేశ్వరం భారీ లడ్డూ
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిషికొండ బీచ్‌లో సముద్రం ముందుకు వచ్చింది. సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి. బుధవారం నాడు ఉదయం రుషికొండ బీచ్ సమీపంలో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది.
అలలు 5 నుంచి 8 మీటర్లు ఎత్తునకు ఎగిసిపడ్డాయి. తీర ప్రాంతం భారీగా కోతకు గురి కావడంతో పాటు బీచ్ లోని విద్యుత్ స్తంభాలు సైతం నేలకు ఒరిగాయి.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనాల కారణంగానే అలల ఉద్ధృతి అధికంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ సూచించింది.

తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్, విజయవాడకు భారీ లడ్డూలు
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఆధ్వర్యంలో తయారు చేసిన ఆరువేల కిలోల భారీ లడ్డూ ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్‌కు తరలించారు. అంతకు ముందు సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు లడ్డూకు ప్రత్యేక పూజలు నిర్వహించి క్రేన్‌తో భారీ లడ్డూను వాహనంలో తరలించారు.
విజయవాడలో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్ ఆధ్వర్యంలో తయారు చేసిన 6300 కిలోల భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వీట్స్ అధినేత శ్రీనుబాబు లడ్డూకు పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications