వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్వేషణ: కుందన్‌బాగ్‌లో కెసిఆర్ క్యాంప్ ఆఫీస్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం సాగించిన అన్వేషణ ముగిసింది. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు వాస్తుపై విశ్వాసం ఉంది. వచ్చే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కెసిఆర్ పాత సిఎం క్యాంపు కార్యాలయాన్ని నిరాకరించారు.

కుందన్‌బాగ్ ప్రాంతంలోని మంత్రుల భవనాలు గల క్వార్టర్ నెంబర్ 4 పట్ల కెసిఆర్ ఆసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇక్కడ మంత్రులు, ఐఎఎస్ అధికారుల క్వార్టర్స్ ఉన్నాయి. ఆ భవనం సరిపోతుందా లేదా అని చూడడానికి కెసిఆర్ మంగళవారంనాడు అధికారులను పంపించినట్లు సమాచారం.

Search for KCR's Hyderabad camp office ends

అధికారులు పరిశీలించి బాగుందని చెప్పిన తర్వాత కెసిఆర్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ భవనంలో పర్యావరణ పరిరక్షణ, శిక్షణా సంస్థ డైరెక్టర్ జనరల్ ఎకె పరిదా ఉంటున్నారు. దారులు కొంచెం ఇరుకుగా ఉన్నప్పటికీ కుందన్‌బాగ్ ప్రాంతం క్యాంపు కార్యాలయానికి అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో బేగంపేటలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రికి, రాజభవన్ రోడ్డులోని లేక్ వ్యూ అతిథి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కేటాయించారు. అయితే, కెసిఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయాన్ని వాస్తు కారణంతో నిరాకరించారు.

English summary

 The search for the camp office for new Telangana chief minister K Chandrasekhar Rao has apparently ended. A vaastu believer, the TRS chief has zeroed in on the Kundanbagh ministers quarters to be his official residence after he takes over as the CM next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X